జనం కొట్టిన దెబ్బ.. ఇంకా జీర్ణించుకోలేకపోతున్న మోదీ?

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన మెజార్టీ దక్కలేదు. 400 సీట్లు సాధిస్తామని ఎన్నికలకు ముందు ఎన్డీయే ఘంటాపథంగా చెప్పింది. ఇక 370 సీట్లను సాధించి సొంతంగా ప్రమాణ స్వీకారం చేస్తామన్న బీజేపీ భంగపాటుకి గురైంది. ఫలితంగా కాంగ్రెస్ కూటమి తృటిలో అధికారం చేజార్చుకుంది.  ఏది ఏమైనా బీజేపీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రికార్డు స్థాయిలో మూడో సారి నరేంద్ర మోదీ ప్రమా ణ స్వీకారం చేశారు.

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీ పనితీరు లేదు. అందుకే ఆ పార్టీ మెజార్టీ మార్క్ కి దూరగా ఉండిపోయింది. మొదటి సారి, రెండో సారి పనిచేసినంత కసిగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు, సంఘ్ పరివార్ కృషి చేయలేదనేది వాస్తవం. అయితే ఎన్నికల్లో హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల్లోను బీజేపీ గతంతో పోల్చితే ఘోర పరాజయాన్ని చవిచూసిందనే చెప్పొచ్చు.

కీలకమైన యూపీ, రాజస్థాన్ తో పాటు మహారాష్ట్రలో ఆ పార్టీ గణనీయంగా సీట్లను కోల్పోయింది. అయితే పార్టీ కార్యకర్తలను విస్మరించి.. బయటి వారిని అందలం ఎక్కించడంతోనే ఈ ఫలితాలు వచ్చాయనే విశ్లేషణలున్నాయి. పైగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి తాము చేసిన పనులను చెప్పలేదనే విమర్శలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ సర్కారు దాదాపు 8 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చింది.  దీంతో పాటు వేల కిలో మీటర్ల  రోడ్లను వేశారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, మరోవైపు నేషనల్ హైవేలను ఏర్పాటు చేశారు.

దీనివల్ల ఆయా ప్రాంతాల వారి భూముల ధరకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా అక్కడి వారి ఆస్తులు పెరిగాయి. అదే సందర్భంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచిత రేషన్ అందిస్తున్నారు. దీంతో పాటు రూ. 10 లక్షల లోపు ముద్ర లోన్స్ , ఉచిత గ్యాస్,  వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, ఆయుష్మాన్ భారత్ తో పాటు మరెన్నో పథకాలను మోదీ అమలు చేశారు. మరి వీరంతా బీజేపీకి ఓటేశారా.. అంటే లేదు. అందుకే 240 సీట్లకు పరిమితం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: