చంద్రబాబే ఆదర్శంగా అడుగులు వేస్తున్న జగన్‌?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ఏపీ మాజీ సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును.. ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన రోజే.. నల్ల కండువాలతో ఎంట్రీ ఇచ్చిన జగన్.. మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా. శాసన సభ సమావేశాల నిర్వహణపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో మంగళ, బుధ వారాల్లో జరిగే సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. మరి ఈ నిర్ణయాలు జగన్ కు మేలు చేస్తాయా.. లేదా అనేది ఓ సారి పరిశీలిస్తే..

ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయి తమ ప్రాంత సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభా దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం అనేది వారి హక్కు అని అంటున్నారు. అందుకే ప్రజలు వారిని గెలిపించింది అని గుర్తు చేస్తున్నారు. మరి జగన్ సమావేశాలకు వస్తారా అంటే.. ఈ విషయంలో ఆయనకు చంద్రబాబు ఆదర్శం అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

గతంలో వైఎస్సార్ హయాంలోను, జగన్ సీఎంగా ఉన్న సమయంలోను చంద్రబాబు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా కూడా విధిగా అసెంబ్లీకి హాజరు అయ్యేవారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో వరుసగా పదేళ్లు, ఏపీలో ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు.  పైగా నిండు సభలో ఆయన్ను అనుమానించారు. మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ చంద్రబాబుని విమర్శించిన వారే. అయిన సరే ఆయన తట్టుకొని సమావేశాలకు హాజరు అయ్యారు. ఆయన అసెంబ్లీలో ఎదుర్కొన్న అవమానాల వల్లే ప్రజల్లో సానుభూతి వచ్చింది. 2024 ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టింది. జగన్ ఇప్పుడు సమావేశాలకు హాజరు కాకపోతే ఈ అవకాశాన్ని ఆయన కోల్పోయినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: