వైఎస్ వారసత్వం జగన్‌ది కాదా.. షర్మిలకు అంత సీన్‌ ఉందా?

వైఎస్ ఆర్ అంటే ఓ బ్రాండ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోను దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు భారీగా ఉంటారు. నాయకుల్లో సైతం పార్టీలకతీతంగా ఆయన ఫాలోవర్లు ఉంటారు. అయితే మరి ఆయన వారసత్వం ఎవరికీ దక్కుతుంది. కుమారుడు వైఎస్ జగన్ కా.. లేక షర్మిళకా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఓ వర్గం పని కట్టుకొని మరీ వైఎస్ నిజమైన వారసురాలిగా షర్మిళను ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే షర్మిళ భజన చేస్తున్నారు.

ఇటీవల ఏపీలో షర్మిళ నిర్వహించిన వైఎస్ జయంతి సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నాయకులు వెళ్లారు. ఈ క్రమంలో వైఎస్ ఆర్ ను పొగుడుతూనే షర్మిళను ఆకాశానికెత్తారు. అయిదేళ్ల తర్వాత ఏపీకి షర్మిళనే సీఎం అవుతారన్న రేవంత్.. వైఎస్ ఆర్ నిజమైన వారసురాలిగా ఆమెను ప్రకటించారు.

మరి నిజంగా వైఎస్ వారసులు ఎవరు అంటే తేల్చేది రాజకీయ నాయకులు కాదని.. అది తేల్చాల్సింది ప్రజలే అని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ రాజకీయ నేతకు బ్రాండ్ ఇమేజ్ ఉంటే దానిని వాడుకునేందుకు పలువురు ప్రయత్నిస్తుంటారు. అయితే ఏపీలో లెక్కలు చూసుకుంటే వైసీపీ ఓటు బ్యాంకులో 90 శాతం మంది వైఎస్ అభిమానులు ఉన్నారనేది ఎవరూ కాదనలేని నిజం. అంటే వైఎస్ వారసుడిగా మాజీ సీఎం జగన్ ను ప్రజలు గుర్తించారు.

అందుకే ఓ సారి అధికారం కట్టబెట్టారు. అప్పట్లో తాను జగనన్న బాణంగా చెప్పుకొన్న షర్మిళ.. సడెన్ గా తాను ఇప్పుడు వైఎస్ వారసురాలిగా ప్రకటించుకోవడం వెనుక ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె ఇదే అంశంతో ఎన్నికలకు వెళ్లినా 1 శాతం మాత్రమే ఓటు బ్యాంకు పొందారు. కానీ వైసీపీ 40శాతానికి పైగా ఓటు షేర్ సాధించింది. కాబట్టి ప్రజలు అంతిమంగా జగన్ నే వైఎస్ వారసుడిగా గుర్తించారు ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని వారు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: