డిఫ్యూటీ సీఎంగా అదరగొడుతున్న పవన్‌.. ఎంత డెడికేషన్‌?

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వచ్చీ రాగానే తన దైన మార్క్ చూపించారు. వరుసగా తనకు కేటాయించిన శాఖలపై సమీక్షలు చేశారు.  ఆయా శాఖల తీరూ తెన్నులు, అధికారుల పనితీరు, వంటి వాటిని ఆయన అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో తనకు కేటాయించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ శాఖల్లో ఉన్న నిధుల గురించి ఆరా తీస్తున్నారు. దీంతో ఆయా శాఖల అధికారులు వివరాలు వెల్లడిస్తున్నారు.

పవన్‌ ఇప్పటికే చాలాసార్లు పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం అయ్యారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో భేటీ అయ్యారు. ఇందులో నిధుల వినియోగంపై చర్చించారు. అలాగే ఆయా శాఖల్లో చేపట్టిన పనుల తీరుపై ఆరా తీశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల ఇంజినీరింగ్ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు పనులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రుణాలు వాటి వినియోగంపై అధికారులతో మాట్లాడారు.

ప్రతీ శాఖలో ఉన్న విభాగాలకు సంబంధించి వేరు వేరుగా అధికారులను పిలిపించుకొని పవర్ పాయింట్ ప్రజంటేషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు సంబంధించి పాయింట్ ప్రజంటేషన్ తీసుకున్నారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, పురపాలికల్లో నీటి సరఫరా పై సైతం ఇలాగే ప్రజంటేషన్ తీసుకున్నారు.

ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది అని పవన్ కల్యాణ్ విమర్శించారు. అయితే ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే.. ఆ మొత్తాన్ని రీయింబర్స్ మెంట్ చేస్తామని ఏఐబీబీ చెప్పిందని తెలిసి పవన్ ఆశ్చర్యపోయారని తెలిసింది. ఇది ఇలా ఉండగా..పవన్ లో ఈ తపన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక్కసారి అధికారం ఇవ్వండి పాలన చేసి చూపిస్తానని చెప్పి.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి పాలనపై తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: