పార్ల‌మెంటు ఫైట్‌: ఆ న‌లుగురు కూట‌మి ఎంపీల‌కు టెన్ష‌నే..!

RAMAKRISHNA S.S.
- ఉత్త‌రాంధ్ర‌ 4 గురు ఎంపీలు స్టీల్ ఫ్లాంట్ కోసం ప‌ట్టు ప‌ట్టాలి
- రామ్మోహ‌న్ నాయుడిపై పెద్ద బాధ్య‌త‌
( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )
పార్లమెంట్ పోరులో విశాఖ స్టీల్ ప్లాంటే ఉత్తరాంధ్రకు కీలక సమస్య. విశాఖపట్నం సహ విజయనగరం శ్రీకాకుళం, అన‌కాప‌ల్లి ఎంపీలకు విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారం అత్యంత కీల‌కంగా మారింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గట్టిగా ఎదిరించి పోరాడ‌టం లేదా కూట‌మి పార్టీ లుగా ఒప్పించడం వంటివి ఇప్పుడు ఎంపీలకు ముందున్న ప్రధాన సమస్య. అధికార పార్టీగా మాత్రమే కాకుండా కేంద్రంలో కూటమి పార్టీగా కూడా టిడిపి ఉన్న నేపథ్యంలో విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు స్థానాల సభ్యులు బలమైన పోరాట స్ఫూర్తితో పార్లమెంట్లో వ్యవహరించాలి. ముఖ్యంగా ఇటీవల  కేంద్ర మంత్రి  కుమారస్వామి వచ్చి.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని, ఆమేర‌కు ప్ర‌ధానిని ఒప్పిస్తామ‌ని ఆయ‌న‌ చెప్పుకొచ్చారు. కానీ దీనిపై అనేక రూపాల్లో సందేహాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారాన్ని తేల్చుకోవడమే ఉత్తమమని పరిశీలల‌కుల‌ భావన.

గ‌తంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం ఇటీవల మళ్ళీ వార్తల రూపంలో వెలుగు చూశాయి. కేవలం రాష్ట్ర హైకోర్టులో ఉన్న  విచార‌ణ నేప‌థ్యంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, హైకోర్టులో కేసు కనుక తేలిపోతే ఏ క్షణమైనా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీక‌రించే ఉంద‌ని అంటున్నారు. దీనిపై పార్లమెంటులో ఒక స్పష్టమైన ప్రకటన చేసేలా చూడాల్సిన బాధ్య‌త ఉత్త‌రాంధ్ర ఎంపీల‌కు ఉంది.

ఇప్పుడు ఏదైతే కుమారస్వామి తన మాటగా చెప్పారో.. దీనిపై కేంద్ర ఇత‌ర‌ మంత్రులతో కానీ ప్రధాన మంత్రితో కానీ చెప్పించడం ద్వారా రాష్ట్ర ఎంపీలు ముఖ్యంగా టిడిపి నేతలుగా ఉన్న వారు ప్రజలకు ఒక బలమైన సంకేతాన్ని, సందేశాన్ని ఇప్పించేందుకు అవకాశం ఉంది. తద్వారా విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో గతంలో వైసిపి, ఇప్పుడు టిడిపి కూడా నాటకాలు ఆడుతున్నాయ‌నే విమ‌ర్శ‌ల‌ను చెరిపేసుకునేందుకు అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా.. కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి.. విశాఖ ప్రజల ఆకాంక్షలు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ద్వారా ఏర్ప‌డిన‌ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఫ‌లితంగా ఇటు పార్లమెంటుగా కేంద్రమంత్రిగా ఆయనకు... రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ఏర్పడి న్యాయం చేసింద‌న్న వాదన ఉభయపక్షాలకు ద‌క్కుతుంద‌ని, మేలు జరుగుతుందని అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: