ప్రత్యర్థులకు చుక్కలు.. అప్పుడే విశ్వరూపం చూపిస్తున్న పవన్‌?

పవన్ కల్యాణ్ పై గత ఐదేళ్లలో అనుచితమైన దాడి చేసిన వారిలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి  భారీగానే ఖర్చు పెట్టారు. ముద్రగడను తెరపైకి వచ్చారు.  అధికారంలో లేనప్పుడే ద్వారంపూడి అవినీతిని టార్గెట్ చేశారు జనసేనాని.  దీనిపై స్పందించిన ఆయన పవన్ తో పాటు ఆయన కుటుంబాన్ని దుర్భాషలాడారు. తూర్పు గోదావరిలోని ఏ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసినా ఓడిస్తానని సవాల్ కూడా విసిరారు.  

ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. ఆయన గుట్టుముట్లన్నీ తెలిసిన జనసేన పార్టీ మెల్లగా.. చుట్టూ కమ్మేయడం ప్రారంభించింది. ద్వారంపూడి ప్రధాన దందా.. బియ్యం స్మగ్లింగ్ అనే ఆరోపణలున్నాయి. ఐదేళ్ల కాలంలో కాకినాడ పోర్టు నుంచి ఆయన ఎంతో బియ్యం స్మగ్లింగ్ చేశారో చెప్పడం కష్టం. బియ్యానికి సంబంధించిన ప్రతి అంశం రాష్ట్రంలో ద్వారంపూడి గుప్పిట్లోనే ఉంటుంది. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఆయన తండ్రే ఉంటారు. ఇప్పుడు ఈ వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు.  

పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల బాధ్యతలు చేపట్టిన వెంటనే బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. మొత్తం వివరాలు బయటకు లాగారు. తాజాగా కాకినాడ పోర్టులో ఉన్న బియ్యం గౌడన్లను సీజ్ చేయించారు. కాకినాడ పోర్టుని ఒక అడ్డాగా మార్చుకొని ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మార్చేశారన్నారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్  సమీక్షా సమావేశం నిర్వహించారు.  శాఖలోని లోపాలపై చర్చించారు.  చిత్తూరు నుంచి కాకినాడ వరకు వ్యవస్థీకృత మోసాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా చేశారన్నారు. ఎవరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా తప్పు చేసిన వారిని కచ్ఛితంగా సాక్ష్యాలతో సహా పట్టుకునేలా కూటమి మంత్రులు అడుగులు వేస్తున్నారని అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: