అక్కడ మోడీ పాలన.. మావోయిస్టులకు మరణశాసనమా?

ఛత్తీస్ గఢ్ లో వరుసగా మూడు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.  15 ఏళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అక్కడి ప్రజల్లో మార్పులను తీసుకువచ్చింది. కానీ 2018లో మావోయిస్టులు, కాంగ్రెస్ నేతలు జట్టుకట్టి బీజేపీని ఓడించారు. దీంతో హస్తం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి దీటుగా సంక్షేమ పథకాలను కొనసాగించింది. వారికి మించి నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టింది. కానీ క్షేత్ర స్థాయిలో అవినీతి బాగా పెరిగిపోయింది.

ప్రతి పనిలోను కమీషన్లు.. సంక్షేమ పథకాల అమలులో డబ్బులు కోతలతో వారిపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో మరోసారి మావోయిస్టులు చెప్పినా సరే వినిపించుకోకుండా బీజేపీకి పట్టం కట్టారు. వాస్తవానికి అన్ని న్యూస్ ఛానెళ్లు, జాతీయ సర్వేలు అన్నీ అధికార కాంగ్రెస్ గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి. బీజేపీ కచ్ఛితంగా ఓడిపోతుందని తేల్చి చెప్పారు. అయినా ఫలితాలు వచ్చే నాటికి అంతా తారుమారు అయింది.

బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. మాజీ సీఎం రమణ్ సింగ్ ఉన్నా ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా కాషాయ పార్టీ ఎన్నికలకు వెళ్లింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మావోయిస్టులను ఊచకోత కోస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని ఏరి పారేస్తున్నారు. తాజాగా ఛత్తీస్ గఢ్- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంఓ భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులతో పాటు ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. కుతుల్, ఫర్సాబెడ, కొడమెట ప్రాంతాల్లో భారీ సంఖ్యలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో సుమారు 1400మంది భద్రతా సిబ్బంది మోహరించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి, భద్రతా సిబ్బందికి ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 16న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోలు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: