జగన్‌ పాలనకూ.. బాబు పాలనకూ తేడా చూపిస్తున్న లోకేశ్‌?

ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాలేదు. అయినా సరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పాలనకు తెలుగుదేశం కూటమి శ్రీకారం చుట్టింది.  సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనతో తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులంతా అందుబాటులో ఉండాలని.. ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఏ విధంగా వ్యవహరించాలో కూడా మార్గదర్శనం చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ ప్రజల్లో గడపాలని.. వారికి ఉన్న సమస్యలను తీర్చాలని సూచించారు. గతానికి భిన్నంగా పాలన అందించాలని కోరారు.

ఇదిలా ఉండగా.. నారా లోకేశ్ సైతం మంగళగిరిలో ప్రజా దర్బార్ ప్రారంభించారు. దీంతో తమ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉంటుందని.. ఏసీ గదులకు ఎమ్మెల్యేలు, మంత్రులు పరిమితం కావొద్దనే సందేశం ఇచ్చినట్లయింది. గత ప్రభుత్వ పాలనలో ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు మధ్య దూరం పెరిగింది. ఏదైనా సమస్య ఉంటే నేరుగా వెళ్లి ఎమ్మెల్యేకు చెబితే దానికి పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తారు. కానీ వారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయమని చెప్పేది. దీంతో కొన్నింటికి పరిష్కారం లభించేది కాదు. దీంతో ఎమ్మెల్యేలపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం అయింది.

దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీకెండ్ హాలిడే పాలిటిక్స్ ఏపీలో నడుస్తున్నాయి. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉండగా.. శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు రెస్ట్ తీసుకునేవారు. గతంలో చంద్రబాబు కూడా ఇదే పద్దతిని అనుసరించేవారు. కానీ ఈ సారి మాత్రం దానికి సీఎం చంద్రబాబు స్వస్తి పలికారు. నారా లోకేశ్, సీఎంలు ఇద్దరూ ఏపీలోనే ఉన్నారు. నారా లోకేశ్ అయితే ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించి వారి వినతులు స్వీకరించారు. వీకెండ్ పాలిటిక్స్ విషయంలో వైసీపీ ఫెయిల్ అయితే.. టీడీపీ విజయవంతం అయింది. దీంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతుంది. దీనిని కొనసాగించాలని వారు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: