సేనాని ఫ్యూచర్‌ ప్లాన్‌: చంద్రబాబును పవన్‌ నిలదీస్తారా?

ఏపీలో కూటమి గెలుపు వెనుకు పవన్ పాత్ర మరువరానిది. పవన్ దూకుడు, టీడీపీ క్షేత్రస్థాయిలో బలం, చంద్రబాబు నాయకత్వం, బీజేపీ మద్దతు కలగలపి ఏపీలో కూటమి అధికారంలోకి రాగలిగింది. అయితే కూటమిని ఏర్పాటు చేయడంలో.. మూడు పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో పవన్ పాత్ర కీలకం. అందుకే పవన్ లేనిదే కూటమి లేదని.. పవన్ లేనిదే నేను లేనని చంద్రబాబు పలు సందర్భాల్లో ఘంటాపథంగా చెప్పారు.

ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీఎం తర్వాత అంతటి హోదా కలిగిని పదవి డిప్యూటీ సీఎం. కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎంను పవన్ కు కట్టబెట్టారు. దశాబ్ధ కాలంగా డిప్యూటీ సీఎం అంటే ఒక రకమైన అపవాదు ఉంది. దానిని మార్చుతూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక పవన్ ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే.. ఏపీ రాజకీయాల్లో పవన్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఆయన వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో కలిసి ఉంటారా.. లేక రాజకీయంగా విభేదించి బయటకు వచ్చి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతారా అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

కొంతమంది విశ్లేషకులు మాత్రం పవన్ ఐదేళ్లు చంద్రబాబుతో కలిసి నడుస్తారనే అంటున్నారు.  ఒకవేళ పవన్ విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది టీడీపీ అధినేతకే చేటు తెస్తుంది.  పవన్ కు సానుభూతి తీసుకువస్తుంది. అందువల్ల ఆ సాహసం చంద్రబాబు చేయకపోవచ్చు. కాకపోతే ఈ ఐదేళ్లు జనసేనాని టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తీసుకోవాలి. అమలు చేయకపోతే చంద్రబాబుని ప్రశ్నించాలి. ఒక బాధ్యాతయుత ప్రతిపక్ష పాత్రని జనసేన పోషించాలి. కూటమిని గెలిపించడంలో ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించారో.. హామీల అమలులో కూడా అదే విధంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: