జగన్‌ చేసిన బ్లండర్‌ మిస్టేక్‌ను సరిచేయబోతున్న చంద్రబాబు?

ఏపీ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు..  ఆ వెంటనే కార్యరంగంలోకి దిగుతారని అంతా భావించారు. కానీ కుటుంబ సమేతంగా ఆయన బుధవారం రాత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం 4 గంటలకే ఆయన మంత్రులతో భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గ సభ్యులతో ఆయన చర్చలు జరిపారు.

గురువారం ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం చేసుకొని వచ్చిన తర్వాత సాయంత్రం 4.41 గంటల సమయంలో సీఎంగా సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుంటారు. అనంతరం ఐదు ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే  చేయనున్నారు.

ఎన్నికల సమయంలో చివరి 10 రోజులు తీవ్ర చర్చనీయాంశం అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు గురించి. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ మేరకు ఆయన రెండో సంతకం దీనిపై చేయనున్నారు. ఎన్నికలను మలుపు తిప్పిన అంశమైన పింఛన్ల పెంపు అంటే ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేలను రూ.4 వేలకు పెంచుతూ సంతకం చేయనున్నారు.

ఇక కీలకమైన అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై నాలుగో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. పేదలకు పట్టెడన్నం పెట్టే ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రూ.5 కే పేదల కడుపు నింపే ఈ పథకాన్ని వైసీపీ నిలిపివేసింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.   మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్దరించనున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పేదవాడికి మేలు చేసే నిర్ణయం. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, వాలంటీర్లకు ఈ పథకం కింద శిక్షణ ఇవ్వనున్నారు. దీనిపై కూడా చంద్రబాబు ఈ రోజే సంతకం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: