ఏపీ: జగన్‌, బాబు కూల్‌ .. వాళ్లెందుకు కొట్టుకుంటున్నారు?

ఏపీలో ఎన్నికలు ఏమో గానీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చాయి. పార్టీల అధినేతలు, బరిలో నిల్చొన్న అభ్యర్థులు బాగానే ఉన్నా.. కార్యకర్తలు మాత్రం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకనైనా మారండ్రా అంటే మేం మారం ఇలానే ఉంటాం అంటూ సినిమాలో డైలాగ్ మాదిరిలా ప్రవర్తిస్తున్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగ పడుతూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఎవరూ గెలిచినా ఏం కాదు. మన జీవితాలు ఏం మారవు అనే చిన్న విషయాన్ని మరిచిపోయి వ్యక్తిగతంగా దాడులకు తెగపడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేశారని ఇంట్లోని కుటుంబ సభ్యులను, మరీ ఘోరంగా కన్న తల్లిదండ్రులను కొట్టి హింసించే ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం.  ఎవరైనా చదువుకోని వారు ఇలా దాడులు చేస్తే.. ఇలా కాదు అని సర్ది చెప్పాల్సిన చదువుకున్న యువతే ఈ ఘర్షణలకు పాల్పడుతుంటే ఈ సమాజం ఏమైపోతుందని పలువురు విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సైకో సైకో  అంటూ జగన్ ను విమర్శించిన పార్టీలోని వారే సైకోలా ప్రవర్తిస్తున్నారు. వైసీ పల్లికి చెందిన సుంకమ్మ వైసీపీ వాళ్లకి సంబంధించిన ఆటోలో వెళ్లి ఓటు వేసింది. దీంతో ఆమె ఫ్యాను గుర్తుకు ఓటేసిందని కోపోద్రిక్తుడైన కుమారుడు తల్లిని కొట్టి చంపాడు. ఈయన టీడీపీ సానుభూతి పరుడు కావడం గమనార్హం.

మరో సంఘటనలో విజయరాయికి చెందిన మంగమూరి పెంటయ్య కుమారుడు వంశీ.. తన కుటుంబ సభ్యులు మొత్తం వైసీపీకి ఓటు వేశారని భావించి ఇనుప రాడ్డుతో వారిపై విచక్షణా రహితంగా దాడులకు దిగాడు.  తల్లి, చెల్లిని కూడా చితకబాదాడు. వాళ్లు చివరకు వైసీపీ నాయకుల ఇంటి వద్దకు వెళ్లి తమను రక్షించమని కోరాల్సి వచ్చింది. ఇంకా పలు చోట్ల టీడీపీ కి ఓటు వేశారని ఇంట్లోకి వెళ్లి దాడులు చేయడం.. మంచి నీటిని ఆపేయడం వంటి ఘటనలు అక్కడక్కడా చోటు చేసుకుంటున్నాయి. మరికొంత మంది రోడ్డుపైకి వచ్చి హింసాకాండకు పాల్పడుతున్నారు. మరి యువతను ఇలా సైకోలుగా మార్చిన ఘనత ఎవరిది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: