చంద్రబాబు: టీడీపీ అభ్యర్థులను మార్చే స్థానాలు ఇవే?

టీడీపీ అధినేత చంద్రబాబు బాంబు పేల్చారు. ఆ పార్టీ ప్రకటించిన 144 అసెంబ్లీ సీట్లు, 17 ఎంపీ సీట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. దీంతో ప్రచారంలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరి సీటు ఎగిరిపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే చంద్రబాబు చెప్పింది అందరికీ కాదు. ఆ భయం కూడా ఎవరూ పడాల్సిన అవసరం లేదని.. అంటున్నారు.

కొద్ది పాటి మార్పులు మాత్రం తప్పకుండా ఉంటాయని అంటున్నారు. అది కూడా అవసరం అయితేనే చేస్తామని.. లేకపోతే లేదు అని చెబుతున్నా.. లోలోపల తెలుగు తమ్ముళ్లలో భయం మొదలైంది. మీకు సీట్లు ఉంటాయని చెబుతున్నా.. మార్చే సీట్లు ఎక్కడ ..ఏయే జిల్లాలు వంటి అంశాలు అభ్యర్థులను మదన పెట్టేదే. ఈ విషయంలో వైసీపీ ముందు జాగ్రత్తతోనే వ్యవహరించింది. అందరి కంటే ముందు సీట్లు ప్రకటించి.. సర్వేలు చేసి.. అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో వారు ప్రశాంతంగా ప్రచారంలో మునిగిపోయారు.

కానీ టీడీపీ నాయకుల్లో భయం మొదలైంది. మరోసారి టీడీపీ వ్యూహకర్త ఐవీఆర్ సంస్థ ఈ మేరకు సర్వేలు కూడా మొదలు పెట్టిందని టాక్ నడుస్తోంది. ఏకపక్షంగా అభ్యర్థుల మార్పు ఉండదని.. అందరితో మాట్లాడిన తర్వాతే మార్పులు చేర్పులు ఉంటాయని చంద్రబాబు అంటున్నారు. ఈ మార్పులు ఉత్తరాధిలో ఒకటి, రెండు చోట్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ఉదయగిరి నియోజకవర్గంలో బొలినేని వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అనకాపల్లి జిల్లాలో మాడుగుల సీటు విషయంలో మార్పు తథ్యమని అంటున్నారు. శ్రీకాకుళంలో రెండు సీట్ల విషయంలో తారా స్థాయిలో తమ్ముళ్ల పోరు సాగుతోంది. ఆ  సీట్ల విషయంలో కూడా మార్పులు తప్పవని అంటున్నారు. తూర్పు గోదావరి అనపర్తి, విజయ నగరం జిల్లా కురుపాంలలో అభ్యర్థులు వీక్ గా ఉన్నారని సర్వే నివేదికలు రావడంతో మారుస్తారు అంటున్నారు. మరో వారం వ్యవధిలో నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు కోరి కెలుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: