జగన్‌: ఎన్నికల సమయంలో చేయకూడని తప్పు చేసేశాడా?

ఉగాది వచ్చిందంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణం వింటారు. ఇందులో ఈ ఏడాది రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందని పండితుల ద్వారా తెలుసుకుంటారు. కరవులు, కాటకాలు, వర్షాలు, రాష్ట్ర ఆదాయ, వ్యయాలు ఇలా అన్నింటిని తెలుసుకుంటూ వస్తుంటారు. అందుకు తగ్గట్లుగా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ఉంటారు.

ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. పైగా ఉగాది అతి పెద్దదైన తెలుగు పండుగ. దీని వెనుక ఉన్న విశిష్టత గురించి మనందరకీ తెలిసిందే. దీంతోనో తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న పండుగ పట్ల సీఎం వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతుంది. గతంలో భారీ సెట్లు వేసి.. ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏపీ సీఎం ఈ సారి అలాంటివి ఏమీ చేపట్టలేదు.

ఈ ఉగాదికి సీఎం జగన్ దంపతులు పండితుల ఆశర్వచనాలు స్వీకరించారు. కాగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం నిర్వహించలేదు. దీంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పల్నాడు పర్యటనలో ఉన్న జగన్ .. గంటావారిపాలెంలో ఉగాది వేడుకలు జరుగుతాయని తొలుత ప్రకటించి.. సీఎం షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇంతలో ఏమైందో తెలియదు. భారీ సెట్టింగులు వేయడానికి వచ్చిన నిర్వాహకులను వైసీపీ నాయకులు వెనక్కి పంపించేశారు.

కానీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ పఠనం నిర్వహించారు. దీనికి చంద్రబాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. వీరంతా పఠనం విని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. ఒక సీఎంగా జగన్  పంచాంగ పఠనం విని రాష్ట్ర భవిష్యత్తును తెలుసుకోవాలని అంటున్నారు. ఇది నిజమైనా.. అబద్ధమైనా అనతి కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని పాటించాల్సిన ధర్మం సీఎంపై ఉంది.  కానీ ప్రస్తుతం జగన్ వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. మరి దీని ప్రభావం ప్రభావం ఎన్నికల్లో ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: