ఏపీ: చంద్రబాబు ఉన్నంతకాలం జగన్‌కు ఢోకా లేదా?

కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి నష్టం చేకూరిస్తాయి. మరోసారి లాభాన్ని తెస్తాయి. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ ద్వారా చీలిక తెచ్చి లాభపడదామని చంద్రబాబు భావిస్తే.. నిరాశే ఎదురైంది. వైసీపీ అఖండ విజయం సాధించింది.  కానీ 2014లో అందర్నీ కలుపుకొని వెళ్లి విజయవంతం అయ్యారు. అలాగే అభ్యర్థుల ఎంపిక కూడా 2019లో టీడీపీ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.

ఈ సారి కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు తమకు కలిసి వస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి.. టిప్పర్ డ్రైవర్ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రెండోది వాలంటీర్లను ప్రభుత్వ పథకాలు పంపిణీ చేయనివ్వకుండా ఆపేయించడం. దీంతో పాటు పొత్తుల వల్ల కూడా తమకే కలసి వస్తుందని అధికార పార్టీ భావిస్తోంది.

ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో తమకు ఓ సీటును పెంచేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఉన్నంతకాలం మాకు తిరుగులేదు అని వైఎస్ పేర్కొన్నారు. అప్పుడు 2009లో మహా కూటమి పెట్టి చంద్రబాబు ఎన్నికలకు వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది.

ఇప్పుడు 2024లో కూడా ఇదే జరుగుతుంది. కల్యాణ దుర్గం కష్టం అనుకుంటున్న సమయంలో అమిలినేనికి సీటు ఇచ్చారు. గుంతకల్లు విషయంలో ఆలోచిస్తుండగా జయరాంను పిలిచి మరీ టికెట్ కేటాయించారు. ప్రొద్దుటూరు లో వరద రాజుల రెడ్డికి సీటు ఇచ్చి మిగతా ఇద్దరినీ దూరం చేయడం తమకు కలిసి వస్తుందని చెప్పారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఒక్క బీసీకి సీటు ఇవ్వకపోవడం, వీటితో పాటు జనసేన, బీజేపీలో తన అనుచరులకు టికెట్లు ఇప్పించడం వల్ల తమకే కలిసి వస్తుందనే అంచనాతో వైసీపీ నేతలు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: