చంద్రబాబు: ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోతారా?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కీలక సమయాల్లో కేసు తెరపైకి రావడం ఆ తర్వాత విచారణ వాయిదా పడటం జరగుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలనే పిటిషన్.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే మరో పిటిషన్ పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది.

అనంతరం ఈ పిటిషన్లపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఇక పిటిషన్ పై విచారణ  సందర్భంగా ఈ కేసు బుధవారం రాత్రే లిస్ట్ అయినందున విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు లాయర్ సిద్దార్థ్ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కూడా మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం వాయిదా వేసింది. ఇక 2015లో తెలగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు చంద్రబాబు పెద్ద పథకమే వేశారు.

ఈ కేసులో తెలంగాణ సీఎం కీలక నిందితుడిగా ఉన్నారు. ఈ క్రమంలో నాడు రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బులను ఎరగా చూపించడాన్ని వీడియోలతో సహా అందరూ చూశారు. మనోళ్లు బ్రీఫ్ట్ మీ అనే వాయిస్ చంద్రబాబు దే నని ఫోరెన్సిక్ కూడా అప్పట్లో నిర్ధారించింది. అయితే ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: