చంద్రబాబు పద్మవ్యూహంలో జగన్‌: అర్జునుడా.. అభిమన్యుడా?

చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. నాలుగున్నర దశాబ్దాల్లో రాజకీయంగా రాటు దేలిన వ్యక్తి. ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయనకు తెలిసినట్లు మరెవరకీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ప్రత్యర్థి ఎంతటి వాడైనా అంచనా వేయగలరు. అందుకు అనుగుణంగా మాట్లాడగలరు. పరిస్థితిని బట్టి స్టెప్ తీసుకొని.. తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలరు. గత ఎన్నికల్లో మోదీని విమర్శించి తగిన మూల్యం చెల్లించుకున్న ఆయన ఈ సారి ఆ పొరపాటుకి తావివ్వకుండా బీజేపీని తన ట్రాక్ లోకి తెచ్చుకొన్నారు.

గత ఎన్నికల్లో చంద్రబాబుపై జగన్ పై చేయి సాధించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు చంద్రబాబుపై ఉన్న కోపంతో జగన్ కు బీజేపీ నుంచి అంతులేని సాయం లభించింది. చిరకాల ప్రత్యర్థి కేసీఆర్ నుంచి కూడా జగన్ కు మద్దతు లభించింది. చంద్రబాబు కి అంతర్గతంగా ఉన్నశత్రువులు సైతం జగన్ తో  చేతులు కలిపారు. అందరూ కలిసి కొట్టడంలో ఆయన ఒంటరి అయ్యారు. కానీ ఆ ఓటమి నుంచి గుణపాఠాలు  నేర్చుకున్న ఆయన ఈ సారి జగన్ ను ఒంటరి చేశారు. తనపై చేసిన ప్రయోగాన్ని అతనిపైనే తిప్పికొడుతున్నారు.

కూటమి పెట్టి రాజకీయంగా తనకు శత్రువులు లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జగన్ నే విమర్శిస్తున్నాయి. దీంతో పాటు కేంద్రం మద్దతుతో ఈసీ ద్వారా తన మనుషులను అధికారులుగా పెట్టించగలుగుతున్నారు. మరోవైపు వైసీపీ ముఖ్య నాయకులను టీడీపీలోకి చేర్చుకొని.. ఆ పార్టీ లోపాలను, ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్నారు.

వివేకానంద రెడ్డి  కేసు నిత్యం వార్తల్లో ఉండేలా అతని కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిళ చేత నిత్యం మాట్లాడిస్తున్నారు. ప్రజల అటెన్షెన్ ను డైవర్ట్ చేస్తూ.. వివేకా హత్య కేసులో జగన్ పాత్ర ఉందని ఆరోపిస్తూ.. పత్రికల, టీవీల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. తాను చెబితే నమ్మరని పవన్, బీజేపీ ద్వారా సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పిస్తున్నారు. ఇలా తన లోపాలను సరిదిద్దుకుంటూ.. చాలా వ్యూహాత్మకంగా వైసీపీని.. సీఎం జగన్ ను అష్టదిగ్భంధనం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: