జగన్‌ను చూస్తే.. బాబు కంటే వీళ్లకే ఎక్కువ ఒళ్లు మంట?

రాజకీయంగా శత్రువులు ఉండటం సహజం. సైద్ధాంతికంగా.. రాజకీయ నిర్ణయాల పరంగా ఒక పార్టీని మరో పార్టీ విమర్శించడం అన్ని చోట్ల జరిగేవే. కానీ ఏపీలో విచిత్ర పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ ల మధ్య ఉంటుంది. కానీ సీఎం జగన్ ను చంద్రబాబు కన్నా ఎక్కువగా ఎల్లో మీడియా విమర్శిస్తూ ఉంటుంది.

ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఈ తక్కువ సమయంలో సాధ్యమైనంత వరకు ఏపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ పత్రికలు తమ సమాయాన్ని, పేపర్ ని వెచ్చిస్తున్నాయి. జగన్ పేరు వినిపించినా.. ఆయన ఫొటో కనిపించినా శివాలెత్తి పోతున్నాయి. టీడీపీ వైసీపీతో రాజకీయంగా మాత్రమే తలపడుతోంది. చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన కంటే కూడా ఎల్లో మీడియానే ఎక్కువగా కోరుకుంటోంది. దీని కోసం ఎలాంటి కథనాలైనా వండి వడ్డించడానికి వెనకాడటం లేదు.

ఎన్నికల వేళ జగన్ తమ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే  జగన్ సభలకు స్పందన లేదని.. వెనుక నుంచి ఫొటోలు తీయడం.. సీఎం మాట్లాడుతుండగానే వెనుదిరిగి వెళ్తున్నారని..కొంతమందిని చూపించడం.. ప్రత్యేకంగా బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి మరీ తరలిస్తున్నారని చెప్పడం వంటికి చూస్తుంటే పిచ్చి పరాకాష్ఠకు చేరిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ సభలు పెట్టినా జనసమీకరణ ఈ విధంగానే చేయాలి.  బహిరంగ సభలకు పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు.

కానీ టీడీపీ సభలకు జనం తండోపతండాలుగా వచ్చినట్లు.. సీఎం జగన్ సభలు వెలవెలబోతున్నట్లు చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా ఎన్నికల వేళ బయటపడుతున్నజగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయట పడుతున్నజాలిగుండె. వినతి కోసం వచ్చినా ఈడ్చి పడేయడమే అంటూ తన అక్కసును వెళ్లగక్కింది. పక్కనే పవన్ కల్యాణ్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్న ప్రచారం వేసి ఆయనకు బ్రహ్మరథం  పడుతున్న ప్రజలు అంటూ వార్తను రాసుకొచ్చింది. అటు చంద్రబాబు, పవన్ ఏం చేసినా ప్రజా క్షేమమే ఎల్లో మీడియాకు కనిపిస్తోంది. జగన్ విషయానికొచ్చే సరికి వారికి నటన కనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: