నిమ్మగడ్డ దెబ్బతో జగన్‌ మంచిపని దేశమంతా తెలిసిందా?

ఆంధ్రాలో పింఛన్లకు సంబంధించి పెద్ద చర్చ నడుస్తోంది. దీంతో పాటు పలు రకాల సందేహాలు ఏపీ ప్రజల్లో మెదులుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా. ఉండదా.. ఇక ముందు కూడా పింఛన్లను ఇలాగే క్యూలో నిలబడి తీసుకోవాలా అని వారిలో వారే గుసగుసలాడుతున్నారు. ఇంతకాలం పింఛన్ల బాధ్యతను వాలంటీర్లు తమ భుజాన వేసుకొని సమయానికి ఇంటి దగ్గరే డబ్బులు అందించేవారు.

అయితే ఇప్పుడది ఆగిపోయింది. ఇప్పుడు దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై చర్చ సాగుతోంది. ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఉంది నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనడంలో సందేహం లేదు. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన ఆయన దానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్ అందిస్తున్న వాలంటీర్లపై వేటు వేయాలని ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం వాలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే దీని వల్ల నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సాధించింది ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థను ఆపు చేయించడం ద్వారా రాక్షసానందం పొందుతున్న ఆయన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  వాలంటీర్లు గౌరవ వేతనం పొంది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారు. అయితే వీరు చెప్పగానే ఓటర్లు అందరూ తమ మనసు మార్చుకొని వైసీపీకి ఓటు వేస్తారా..

ఒకవేళ అలాంటి ప్రచారమే చేస్తే.. అన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వీరిని గుర్తించి సస్పెండ్ చేయించవచ్చు కదా..  పాలనా యంత్రాగాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తే దీని వల్ల జరిగిన నష్టం ఏంటి. ఎందువల్ల వాలంటీర్ వ్యవస్థను నిలుపుదల చేయించారు. ఓటు అనేదే వారి వ్యక్తిగత నిర్ణయం. ఏపీలో ప్రజలు వాలంటీర్లు చెప్పింది గుడ్డిగా నమ్మి.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా అంత అమాయకంగా ఓటు వేస్తారా..  ఎవరు నిజమైన నాయకుడు తెలుసుకుని ఓటు వేయలేనంత అజ్ఙానంలో ఏపీ ఓటర్లు ఉన్నారా. అంతిమంగా మనం ప్రజలకు మంచి చేశామా.. చెడు చేశామా నిమ్మగడ్డ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: