చంద్రబాబు: ఆ నిమ్మగడ్డ.. ఎక్కడ ఉన్నాడో చూడండ్రా?

40 ఏళ్ల రాజకీయ అనుభవం. ఈ పదం వినగానే ఠక్కున మనకి చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన పలు సందర్భాల్లో ఆయన నాది 40 ఇయర్స్ ఇండస్ర్టీ అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇన్నేళ్ల రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రత్యర్థులను తన దారిలోకి తెచ్చుకుంటారు కానీ.. ప్రత్యర్థుల పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత పడరు.

ఆచుతూచి వ్యవహరిస్తూ..సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని. చుట్టూ ఉన్నవారిని తనకు ఉపయోగపడేలా చేసుకుంటూ ఉంటారు. అలాంటి చంద్రబాబు వాలంటీర్ల విషయంలో తప్పటడుగు వేశారా అనే సందేహం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఎంతో మందిని బురిడీ కొట్టించిన చంద్రబాబునే.. ఆయన చుట్టు పక్కన ఉన్నవారు తప్పు దోవ పట్టించారు. ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లి అందిస్తున్నారు. ఈ ఐదేళ్లుగా ఆయా కుటుంబాలకు వాలంటీర్ సుపరిచితులు. ఈ క్రమంలో వైసీపీ వారిని రాజకీయంగా వాడుకొని.. వాళ్ల చేత ఓట్లు వేయించమని అడుగుతారు. ఇదే జరిగితే మనం మరోసారి ఘెర పరాజయాన్ని మూట గట్టుకోవాల్సి ఉంటుందని కొంతమంది చంద్రబాబు ని తప్పుదోవ పట్టించారు.

ఇది నిజమే అని నమ్మిన ఆయన తన కున్న శక్తులు, పలుకుబడి ఉపయోగించి వాలంటీర్ వ్యవస్థను ఆపేయించగలిగారు. పార్టీకి మట్టి అంటకూడదనే ఉద్దేశంతో తన అనునూయులు రమేశ్ కుమార్  చేత ఎన్నికల సంఘానికి పిటిషన్ వేయించి మొత్తానికి తాను అనుకున్నది సాధించగలిగారు.

ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీకి, సీఎస్ కు మరో లేఖ రాశారు. అయితే ఇక్కడ చంద్రబాబు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. సచివాలయ ఉద్యోగులను కూడా సీఎం జగనే నియమించారు. అప్పుడు వీళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించరా. ఇవన్నీ పక్కన పెడితే.. తమ మాటల కంటే వాలంటీర్ మాటలనే ప్రజలు నమ్ముతారు అని భావించి వారిని తీసేయించగలిగారు. దీంతో ఇప్పుడు పింఛన్లు టీడీపీని ఆపేయించింది అనే ప్రచారాన్ని వైసీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా ఈ వాదనను నమ్ముతున్నారు. మరి ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: