చంద్రబాబు: ఇప్పటికే చినిగి చేటయ్యింది.. ఇక ఆపేస్తే మంచిదేమో?

ఏపీలో ఎన్నికల వేళ ప్రతి అంశం రాజకీయంగా కాక రాజేస్తోంది. ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ ఫిర్యాదు చేయడం.. దీనికి స్పందించిన ఈసీ వాలంటీర్లు సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఆంక్షలు విధించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఒకటో తారీఖు రావడంతో ఇప్పుడు పింఛన్ల రగడ మొదలైంది. ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ ఇంకా అందలేదు. దీనికి మీరే కారణం అంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

టీడీపీ వాలంటీర్లకు అభ్యంతరం చెప్పడం వల్లే పింఛన్లు ఆగిపోయాయని అందరికీ తెలిసిందే. కానీ దీనికి కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. వాస్తవానికి ఈ నెల మూడు నుంచి వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెల ఒకటో తేదీనే వీటిని ఇస్తుండగా ఆర్బీఐ సెలవులు, ఇతరత్రా కారణాలతో ఏప్రిల్ నెల పింఛన్లు మూడో తేదీన చేపట్టనున్నట్లు ముందుగానే ప్రకటించింది.

అయితే దీనిపై అటు ఎల్లో మీడియా..ఇటు టీడీపీ నేతలు ఒక విచిత్ర వాదనను తెరపైకి తెచ్చారు. ఏపీలో పింఛన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు. అందుకే ఒకటో తారీఖున పింఛన్లు ఆలస్యం అవుతున్నాయి.  ఈ జాప్యాన్ని టీడీపీపై నెట్టాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఆపిన సొమ్మును సచివాలయ ఉద్యోగుల ద్వారా అందించాలని ఉచిత సలహాలు ఇస్తూ లేఖలు రాస్తున్నారు.

ఈ విషయం ఇంతటితో వదిలేస్తే టీడీపీకే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే గత నాలుగన్నరేళ్లలో పింఛన్ ఎప్పుడూ ఆలస్యం కాలేదు. అలాంటిది ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఆసాహసం చేస్తుందా.. మరొక అంశం ఏంటంటే.. ప్రభుత్వం ముందుగానే చెప్పింది మూడో తారీఖు నుంచి పంపిణీ చేస్తామని కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని లేనిపోని నిందలు వేసి అభాసుపాలు కావడం తప్ప మరేదీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: