ఏపీ: టీడీపీ మీడియా... చదువులపైనా రాజకీయాలేనా?

ఏపీలో ఎల్లో మీడియా తీరు ఎప్పుడూ వన్ సైడెడ్ గానే ఉంటుంది.  చంద్రబాబుకి భజన చేసే క్రమంలో సీఎం జగన్ పై, ప్రభుత్వంపై విష ప్రచారానికి దిగుతున్నారు. అయితే అది అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీకి మైనస్ చేసేలా ఉంది. నైతిక విలువల పరంగా ఎల్లో మీడియా అనేక మెట్లు దిగిపోయింది. చంద్రబాబుకు మేలు చేయాలనే భావనతో అబద్ధపు, అర్థ సత్య ప్రచారాలకు దిగుతోంది.

ఇందులో భాగంగా చదువుల పేరుతో చక్కబెట్టేద్దాం అనే కథనాన్ని ప్రచురించింది. ఎప్పుడో జూన్ లో మొదలయ్యే ఇంటర్ తరగతులకు ఏప్రిల్ లోనే ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విద్యారంగంలో  తాము తీసుకు వచ్చిన సంస్కరణలను పరోక్షంగా ప్రజలకు వివరించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఎత్తుగడ వేసింది. నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.. ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కాలేజీ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ విద్యార్థులను మోటీవేట్ చేస్తూ ఆన్ ది స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టడం ఇదే మొదటి సారి. అది కూడా అడ్మిషన్లకు ప్రచారాన్ని వద్దని చెప్పే ప్రభుత్వమే ఈ సారి నేరుగా ప్రచారం చేయాలని ఆదేశించడం వెనుక ఉద్దేశం ఎన్నికల నేపథ్యమని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

అయితే ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి ఏయేం కోర్సులు చేయాలి.  మీకు దేనిపై ఆసక్తి  ఉంది. మీరు ఇందులో అయితే రాణిస్తారు అని చెప్పి ఇంటర్ అడ్మిషన్ ఇవ్వడంలో తప్పేం ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు పది పరీక్షలు అయిపోగానే ఈ ప్రక్రియను మొదలు పెడుతుంటాయి. ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటే దానిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు వైసీపీకే ఓటేయమని ఎందుకు సూచిస్తారు? ఒకరిద్దరు వైసీపీ సానుభూతి పరులు ఉన్నా అందరూ ఉండరు కదా అని విశ్లేషిస్తున్నారు. మనకు అనుకూలంగా ఉండేవారు అధికారంలో రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దానికోసం ఇంతలా దిగజారాలా అనేదే అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: