చంద్రబాబు: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. మరీ ఇంత సెల్ఫ్‌గోల్‌ ఏంటయ్యా?

చంద్రబాబు రాజకీయం అంతా వేరే ఉంటుంది అంటారు. ఆయన చేతికి మట్టి అంటించుకోరు. కానీ చేయాల్సింది చేస్తూ ఉంటారు. వాలంటీర్ల వ్యవస్థ పై గత నాలుగేళ్లుగా నిప్పులు చెరుగుతున్న వచ్చిన చంద్రబాబు ఎన్నికల వేళ మాత్రం మచ్చిక  చేసుకునే పనిలో పడ్డారు. వారికి ఏకంగా నెలకు రూ.50 వేలు దాకా ఆదాయం వచ్చేలా చేస్తానని ఒక వైపు చెబుతూ..మరోవైపు తన వారితో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్లను మూడు నెలల పాటు విధులకు దూరంగా పెట్టించారు.

అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి సేవలు అందుతున్న వారికి ఇబ్బందులు కలుగజేశారు అనే అపఖ్యాతిని చంద్రబాబు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో గత అయిదేళ్లుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అందుతున్నాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఫిర్యాదు చేసి మరీ ఇంటింటింకీ అందించే సేవలను  నిలుపు చేయించారు.

ఇప్పుడేమో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. వాలంటీర్లలతో పింఛన్ల పంపిణీ ఆపి వేయించిన ఆయన ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని విజ్ఙప్తి చేస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ జరిపేలా చూడాలని డిమాండ్ సైతం చేస్తున్నారు.

ఈ మేరకు సీఎస్ తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సైతం లేఖ రాశారు. తగు చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరారు. అయితే వృద్ధులు, వితంతువులు, వికలాంగులను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఆరు నెలల పాటు సాము చేసి మూల ఉన్న ముసలమ్మను కొట్టినట్లుగా చంద్రబాబు రాజకీయం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఎన్నికల వేళ సెల్ప్ గోల్ అని మరి దీనిని టీడీపీ ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: