ఏపీ బీజేపీ: రగులుతున్న బడబానలం.. బద్దలవుతుందా?

ఎంతో ఆర్భాటంగా గెలుపుని టచ్ చేయాలని లక్ష్యాన్ని చేరుకోవాలని ఏపీలో  టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టాయి. కానీ అసలైన మసాలా దినుసు మిస్ అవుతోంది అనే చర్చ సాగుతోంది. ఏ వంటకం రుచికరంగా తయారు కావాలంటే దినుసులు అన్నీ సమపాళ్లలో ఉండాలి. అప్పుడు అది పండుతోంది. అలాగే రాజకీయ వంటంకం పండాలన్నా అన్ని రాజకీయ పార్టీల మధ్య సయోధ్య ఉండాలి.

కానీ ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో కీలకమైన అంశమే మిస్ అవుతోంది అని అంటున్నారు. అదే పెద్ద లోటుగా చెబుతున్నారు. సయోధ్య ఉన్నది ఉండాలి. ఉమ్మడి ఎజెండా ఉండాలి. సర్దుబాటు ఉండాలి. కానీ ఈ కూటమిలో ఇవన్నీ మిస్ అవుతున్నాయోమో అనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.  అయితే బీజేపీలో కూటమి కుంపట్లు ఇంకా చల్లారినట్లు లేదు. పొత్లు వ్యవహారమై సీట్ల సర్దుబాటు పట్ల బీజేపీ స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

తాజాగా బీజేపీ అగ్రనేతల అనూప్ సింగ్, మధుకర్ జీలు ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో వారిద్దరని స్థానిక నాయకులు నిలదీశారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో సీఎం రమేశ్ , ఈశ్వర్ రావుకి సీట్లు ఇవ్వడం పై వారు ఆగ్రహం చేశారు. వెలమ, కమ్మ వర్గానికి ఉత్తరాంధ్రలో సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  రాష్ట్ర బీజేపీ అగ్రనేతలైన జీవీఎల్, సోము వీర్రాజులకు సీట్లు ఇవ్వకపోవడంపై మండిపడ్డారు.

మరోవైపు కాపు నేతలకు ఒక్క  సీటు ఇవ్వకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధేశ్వరి తీరు వల్లే పార్టీ భ్రష్టు పట్టిందని వారికి తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు కమ్మ సామాజిక వర్గానికే కేటాయించడం పట్ల వారు మధుకర్ జీ, అనూప్ సింగ్ లను నిలదీసినట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం ఎలా పనిచేయాలని వారితో వాపోయారు. బీజేపీ అధిష్ఠానం అసంతృప్త నాయకులను బుజ్జగించేందుకు దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: