చంద్రబాబు: తెలుగు తమ్ముళ్లే దెబ్బేస్తున్నారా?

చేసుకున్నోడికి  చేసుకున్నంత అన్నట్లుగా చంద్రబాబు తీరులో ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒక వైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కొంటున్న చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పడిన ఆరాటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిందా మీదా పడి మొత్తానికి మోదీ జట్టులో మిత్రుడి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పడిన శ్రమను టీడీపీ కార్యకర్తలు మరిచిపోయినట్లు కనిపిస్తోంది.

పొత్తు పెట్టుకున్న మూడు పార్టీల్లో బీజేపీ, జనసేనతో పోల్చుకుంటే టీడీపీకి ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. అయినా కానీ ఈ రెండు పార్టీలు లేకపోతే తాము గెలవలేమని భావించే కదా చంద్రబాబు నాయుడు వారితో పొత్తు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో 31 స్థానాల్లో తమ పార్టీ గెలిచే పరిస్థితే ఉంటే.. వీటిని వదులుకునేందుకు టీడీపీ అధినేత సిద్ధపడతారా? ఎనిమిది పార్లమెంట్ స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయిస్తారా.. ఉన్నదే 175 అసెంబ్లీ,  25 ఎంపీ సీట్లు.

ఈ సారి అధికారం పక్కాగా దక్కి తీరాలి. ఇలాంటి సమయంలో ప్రతి సీటు ప్రతిష్ఠాత్మకమే. ఈ విషయం అటు ఆ పార్టీ అధినేతకు.. తెలుగు తమ్ముళ్లకు బాగా తెలుసు.  గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాం. ఈ సారి ఏ చిన్న అవకాశం వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులను చంద్రబాబు పొత్తులకు ఒప్పించారు.  అయినా కానీ కొంతమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు వితండ వాదం చేస్తూ వింత పోకడలను అవలంబిస్తున్నారు.

రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ శ్రేణులు బీజేపీ పై ఎదురుదాడికి దిగుతున్నారు. జగన్ తో బీజేపీ నేతలు కుమ్మక్కై ఆయనకు నరసాపురం టికెట్ టికెట్ రాకుండా అడ్డుకున్నారు అంటూ పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో లేరు.  కానీ టికెట్ ఇవ్వలేదని టీడీపీ సోషల్ మీడియా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఇదే క్రమంలో పార్టీ కోసం కష్టపడిన దేవినేని ఉమా, బండారు సత్యనారాయణ, ఆలపాటి రాజా, కంటతడి పెట్టిన సుగుణమ్మ బాధలు వీరికి పట్టవు. కానీ పక్కపార్టీ వారిపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తూ చంద్రబాబుకి చేటు తెస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: