చంద్రబాబుకు జేపీ మద్దతు కలసివస్తుందా?

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ్.. తాజాగా ఏపీలో ఎన్డీఏ కూటమిని స్వాగతించారు. ఏపీలో ఎన్ డి ఎ కూటమి ఆలోచనను ఆహ్వానిస్తున్నామన్న  జయప్రకాశ్‌ నారాయణ వారికీ మా మద్ధతు ప్రకటిస్తున్నామని తెలిపారు. రానున్న ఎన్నికలు రెడ్లకు, కమ్మవాళ్ళకి, కాపులకి జరుగుతున్న ఎన్నికలు కావని.. సంక్షేమాన్ని అభివృద్ధి నీ సమాతూకాన్ని పాటించాల్సిన అవసరం ఉందని... సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పరామవాదిగా ఉండకూడదని  జయప్రకాశ్‌ నారాయణ అభిప్రాయపడ్డారు.

కచ్చితంగా జాతికి సంక్షేమమే వ్యక్తిగతం, తత్కాలికం.. అభివృద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుందన్న  జయప్రకాశ్‌ నారాయణ... మన దౌర్భాగ్యం ఏమిటీ అంటే కులాలు గురించే మాట్లాడుతారన్నారు. కులాలకు అతీతంగా ప్రజాసంక్షేమం కోసం మాట్లాడేవాళ్ళు కరువు అయ్యారని.. ప్రస్తుత ఎన్నికలకు కులం తప్ప, అక్రమ సంపాదన గురించి తప్ప మిగిలిన ఏ అర్హత లేదని.. నన్ను కూడా కులం పేరుతో విమర్శిస్తారని  జయప్రకాశ్‌ నారాయణ వాపోయారు.

రాష్ట్రంలో ప్రశాతం గా ఎన్నికలు జరుగుతాయా... ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటారా అనే అనుమానం కలుగుతుందన్న  జయప్రకాశ్‌ నారాయణ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా మన డబ్బు. ఎవ్వరు సొంత డబ్బులు ఇవ్వటం లేదన్నారు. లోక్ సత్తా నిరంతరం ఇదే విషయం గురించి చెప్తున్నామన్న  జయప్రకాశ్‌ నారాయణ.. యూపీ  సాధ్యం అయినా విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు సాధ్యం కావటం లేదని ప్రశ్నించారు.

ఆర్ధిక భవిష్యత్ కాపాడే వారు ఎవరు, మన కాళ్లపై మనం నిలబడే విధంగా చేసే వారు ఎవరు అని ప్రజలు పరిశీలించుకోవాలని సూచించిన  జయప్రకాశ్‌ నారాయణ.. ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అనే ఆలోచన తప్పన్నారు. సామాన్య ప్రజల జీవితాలు మారాలి అంటే అభివృద్ధి చూసి ఓటు వెయ్యాలని.. ప్రజల్లో వున్నా అమాయకత్వంను ఆసరా చేసుకొని రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని.. కర్ర వున్నవాడిదే బర్రె అనే విధంగా రాజకీయాలు ఉండకూడదని  జయప్రకాశ్‌ నారాయణ సూచించారు. నిర్భయంగా నమ్మిన వారికీ ఓటు వేయండని  సూచించిన  జయప్రకాశ్‌ నారాయణ.. ఈవీఎంలలో ఎటువంటి లోపాలు లేవని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

jp

సంబంధిత వార్తలు: