టీడీపీ బ్రాండ్‌ను సొంతం చేసుకున్న జగన్‌?

జగన్ పక్కా వ్యూహాలతో ఎన్నికలకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు కూటమి కట్టడంతో గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సామాజిక కోణాన్ని తెరపైకి తెచ్చి విపక్షాల ప్రయత్నాలను గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలతో పాటు మైనార్టీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చారు. కూటమి పార్టీలు తనను అందనంత ఎత్తులో జగన్ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించడం విశేషం. అందులో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత అణగారిన ముస్లిం, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది. ఎంతో మంది బీసీ నాయకులు పుట్టుకొచ్చారు. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా టీడీపీ మారింది. నఅయితు అప్పట్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ ప్రాంతీయ పార్టీగా ఉండేది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ టీడీపీతో పోల్చుకుంటే బీసీలు తక్కువ సీట్లు కేటాయించేది.

దీంతో బీసీల అభిమానాన్ని టీడీపీ చూరగొనేది. జాతీయ పార్టీ కావడంతో రకరకాల రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ టీడీపీ మాదిరిగా బీసీలకు, ఇతర వర్గాలకు సీట్లు కేటాయించలేకపోయేది. కానీ ఆ ఫార్ములాను టీడీపీ పాటించి విజయవంతం అయ్యేది. ఇప్పుడు అదే సూత్రాన్ని జగన్ టీడీపీకి వదులుతున్నారు. తాజాగా ప్రకటించిన వైసీపీ జాబితాను పరిశీలిస్తే మొత్తం 47 అసెంబ్లీ సీట్లను బీసీలకు ప్రకటించారు. ఎంపీ సీట్ల విషయానికొస్తే 11మందిని నిలబెట్టారు.

ఇందులో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట కూడా కాపులను బరిలో దింపి.. అధిక సంఖ్యలో వారికి సీట్లు కేటాయించి అటు జనసేనకి సవాల్ విసిరారు.  ఇప్పటి వరకు బీసీలు టీడీపీకి అండగా ఉండేవారు. కానీ జగన్ తొలిసారి యాభై శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించారు. వైసీపీతో పోల్చితే ప్రస్తుతం టీడీపీ ఇన్ని సీట్లను ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ పార్టీ ప్రకటించిన 128 సీట్లలో బీసీలకు కేటాయించింది 24 మాత్రమే. ఇంకా చేతిలో ఉన్నవి 16. అందులో బీసీలకు ఎన్ని ఇస్తారో తెలియదు. మొత్తంగా చూస్తే అటు టీడీపీ, ఇటు జనసేనకు జగన్ కోలుకోలేని దెబ్బను కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: