చంద్రబాబు గెలిస్తే.. ఆ ఆరుగురే కారణం?

ప్రజల ఆదరణ, అభిమానాన్ని చూరగొన్న నాయకులే అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ప్రజల ఆనుగ్రహం పొందేందుకు రాజకీయ నాయకులు రకరకాల ఎత్తులు వేస్తుంటారు. వ్యూహాలు పన్నుతారు. ఏవేవో మాటలు చెబుతుంటారు. ఇందులో ఎవరి మాటలకు అయితే ప్రజలు ఆకర్షితులవుతారో వారే విజేతలవుతారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య పవర్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ తమ ప్రత్యేక ప్రణాళికతో ఈసారి ఎన్నికలకు ముందుకు వెళ్తున్నాయి.

ముందుగా సీఎం జగన్ విషయానికొస్తే.. గడిచిన ఐదేళ్లలో నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి. నావల్ల లబ్ధి జరిగిందని భావిస్తే వైసీపీకి ఓటే వేసి మరోసారి ఆశీర్వదించండి. మీ కోసం 240 సార్లకి పైగా బటన్ నొక్కాను. నాకోసం మీరు రెండు సార్లు బటన్ నొక్కలేరా అంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసే తనకు ఓటేయాలని కోరుతున్నారు.

ఇక చంద్రబాబు విషయానికొస్తే పూర్తి భిన్నం. జగన్ మంచి వాడు కాదు కాబట్టి నాకు ఓటేయ్యండి అని అభ్యర్థిస్తున్నారు.  తన గత పాలన చూసి కానీ.. తన పాలనకు, ప్రస్తుత పాలనను తేడాను గమనించి కానీ ఓటేయమని అడగడం లేదు. సహజంగా జగన్ కి 2019-24 వరకు పాలన చేతకాలేదు కాబట్టి నన్ను గెలిపించండి అని అడగడంలో తప్పు లేదు.

కానీ ఆయన జనసేన, బీజేపీ నా వైపే ఉన్నారు. మా కూటమిని మరోసారి ఆదరించండి. ఈ సారి జగన్ కు మించి సంక్షేమాన్ని అందిస్తాం అంటున్నారు.  జగన్ కు వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహా టీవీ, టీవీ 5, ఏబీఎన్, ఈటీవీలు పనిచేస్తున్నాయి. జగన్ పాలనలో ఫెయిల్ అయ్యారని చంద్రబాబు స్వయంగా చెప్పడం లేదు. పత్రికలు, టీవీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నమ్ముకుంది ఈ ఆరు మీడియాలనే. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే వీటి ప్రభావంతోనే అనేది సుస్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: