తెలుగుదేశం జాబితాలో వీళ్లు వెరీ స్పెషల్‌?

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇటీవల వైసీపీ, టీడీపీ అభ్యర్థుల జాబితాలు విడుదల చేశాయి. 34మందితో ఈ జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం మొదటి లిస్ట్ లో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన లిస్ట్ తో మొత్తం 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

సీట్ల ఒప్పందం ప్రకారం 17 ఎంపీ సీట్లు, 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. బీజేపీ ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లు, జనసేన రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది.  ఈ మేరకు చంద్రబాబు  వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు మొదటి జాబితాను మీ ముందు ఉంచాం. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ ను తీసుకువచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే ప్రజా అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చాం. టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  

ఈ లిస్ట్ లో బలమైన అభ్యర్థులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. యరపతినేని ని.. చింతమనేని ప్రభాకర్ ని వదలిపెట్లేదు.  బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ రాకపోవడంతో పార్టీ నుంచి వచ్చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తుండగా.. ఆయన మాత్రం పార్టీలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు గండి బాబ్జి పార్టీకి రాజీనామా చేయగా.. గంటా శ్రీనివాసరావు అయోమయంలో ఉన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయం లేకపోవడంతో రెండు, మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.

ఈ లిస్ట్ లో భాష్యం ప్రవీణ్ కు సీటు లభించింది. ఆయన్ను మొదటి నుంచి నారా లోకేశ్, ఏబీఎన్ ఆర్కే  ప్రమోట్ చేస్తూ వచ్చారు. పిడుగురాళ్ల మాధవి గుంటూరు నుంచి పోటీ చేయనున్నారు.  భర్త కమ్మ సామాజిక వర్గం.. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో బీసీ కోటాలో సీటు కేటాయించారు. విజయవాడ పశ్చిమ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: