మోదీ భయం.. వైసీపీని వెంటాడుతోందా?

తెలుగుదేశం పార్టీలో  బీజేపీ పొత్తు కుదిరే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. అసలు బీజేపీ టీడీపీ రూట్లోకి రాదని వైసీపీ అనుకూల మీడియా చెప్పుకొచ్చింది. ఒకవేళ పొత్తు కుదిరినా కాషాయ నేతలు ఎక్కువ సీట్లు అడుగుతారని.. పవర్ షేరింగ్ సైతం అడుగుతుందని తనను కాకున్నా పవన్ అడ్డు పెట్టుకొని రాజకీం చేస్తుందని వైసీపీ అనుకూల మీడియా విశ్లేషించింది.

అసలు టీడీపీని కలుపు కెళ్లేందుకు బీజేపీ అగ్రనేతలు ఇష్టపడటం లేదని తేల్చి చెప్పింది. వైసీపీ అంటేనే బీజేపీకి అపార గౌరవం అని.. టీడీపీ కి తలుపులు మూసేసినట్లే అని రకరకాల ప్రచారం జరిగింది. కానీ వీటన్నింటికి తెర దించుతూ బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. పది అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ మాట చెల్లుబాటు కాకుండా పోయింది.  

అయితే ఈ కూటమి ని ఎదుర్కొనేందుకు వైసీపీ నేతలు పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నారు. పొత్తు కుదరకుండా రకరకాల ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలి అనే డైలమాలో పడ్డారు అనిపిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ప్రధాని మోదీ విషయంలో భయపడుతున్నారు.  ఎందుకంటే మోదీ ప్రభావం అర్బన్ ప్రాంతాలతో పాటు తటస్థ ఓటర్లు, విద్యావంతులపై కచ్ఛితంగా పడుతుంది. 2014లో వైసీపీకి అనుకూల పవనాలు వీచినా మోదీ దెబ్బతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి.

ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని వైసీపీ భావిస్తోంది. గతంలో ప్రధాని అవుతారనే వేవ్ లోనే ఆ రేంజ్ లో ప్రభావం చూపితే ఇప్పుడు కచ్చితంగా మూడోసారి పగ్గాలు స్వీకరించడం పక్కా అని తేలుతున్న క్రమంలో ఈ సారి ఆ ప్రభావం ఇంకాస్త ఎక్కువగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని మోదీ మాటకు విలువ ఎక్కువ. ఆయన ప్రభుత్వంపై ఏ రకమైన విమర్శలు చేస్తారో.. వాటిని ఎలా తిప్పి కొట్టాలో.. ఏ విధంగా స్పందిస్తే బీజేపీ అధిష్ఠాన ఆగ్రహానికి లోను కాకుండా ఉంటామో అని వైసీపీ మదన పడుతోంది. మొత్తానికి అయితే మోదీ భయం వైసీపీకి పట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: