తెలంగాణ కోసం మోదీ సంచలనం?

లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్రం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిన వాహనాల రిజిస్ర్టేషన్ మార్క్ ను టీఎస్ నుంచి టీజీ గా మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ కు కేంద్రం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఏడాది సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపుకుంటామని తెలిపారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ కు 13 నెలల తర్వాత స్వాతంతర్యం వచ్చింది. అప్పటి వరకు నిజాంల పాలనలో ఉందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆపరేషన్ పోలో అనే పోలీసు చర్య తర్వాత ఈ పాలన నుంచి విముక్తి పొందింది. సెప్టెంబరు 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవం గా నిర్వహించాలనే డిమాండ్ ఈ ప్రాంత ప్రజల నుంచి ఉంది.

నోటిఫికేషన్ ప్రకారం.. ఇప్పుడు హైదరాబాద్ విముక్తి చేసిన అమర వీరులను స్మరించుకోవడానికి, యువతలో దేశ భక్తి జ్వాలలను వెలిగిండడానికి భారత ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.  1947లో భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రజకార్లు, భారత్ యూనియన్ లో దాని విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్ ను పాకిస్తాన్ లేదా, ముస్లిం ఆధిపత్యం కావాలని పిలుపునిచ్చారు.

దీనికి వ్యతిరేకంగా ఇక్కడి స్థానిక ప్రజలు పోరాడారు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేలో సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేశారు. గత కొన్నేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏటా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జ్ఙాపకార్థం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక నుంచి దీనిని అధికారికంగా నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని నిర్వహిస్తుందా అంటే అనుమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: