అయ్యయ్యో.. గీతాంజలి పిల్లల పరిస్థితేంటి?

మనిషిని చంపాలంటే పెద్ద పెద్ద ఆయుధాలే అవసరం లేదు. ఒక చిన్న మాట చాలు. ఎదుటి వారి మనసు ముక్కలయి వారు కృగి కృషించి పోవడానికి. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత వేధింపులు కొత్త రూపం సంతరించుకున్నాయి. అదే ట్రోలింగ్.. ఎవరో తెలియదు.. ఎక్కడ ఉంటారో తెలియదు. చేతిలో స్మార్ట్ ఫోన్, దానిలో డేటా బ్యాలెన్స్ ఉంటే చాలు ఇక రెచ్చిపోవచ్చు.

ఎలాగూ మన ముఖ చిత్రం ఎదుటి వారికి కనిపించదు. కాబట్టి నచ్చినట్లు వారిని మాటలతో హింసించి.. వేధించి రాక్షసానందం పొందవచ్చు. కానీ మన పైశాచిక ఆనందం వల్ల ఓ నిండు జీవితం తెల్లారిపోతుందని తెలిసినా.. మానుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం.  ఎదురుగా వచ్చి మాట్లాడేవారిని ఎలాగైనా చిత్తు చేయవచ్చు. కానీ ఆన్ లైన్ వేదికగా ఎవరో తెలియని వ్యక్తి చేసే ట్రోలింగ్ భరించడం కష్టం. ఎంతో మనో నిబ్బరం ఉంటే తప్ప ఈ సమస్య నుంచి బయట పడలేరు.

గీతాంజలి అంటే ఓ సామాన్య మహిళ. తెనాలిలో ఇస్లాం పేర భర్త, ఇద్దరు పిల్లలు. కష్టపడి పని చేసుకుంటూ.. వారి కుటుంబ బాగోగులు చూడటమే ఆమె దినచర్య. అందరికీ ఉన్నట్లు ఆమెకు సొంతిల్లు అనేది కల.  కానీ ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించకపోవడంతో  ఆ కలను సమాధి చేసుకుంది. కానీ సీఎం జగన్ దానిని నెరవేర్చారు. గీతాంజలికి ఇంటి పట్టా అందించి ఆమె కళ్లలో ఆనందం చూశారు.

కానీ కొంతమంది దీనిని తట్టుకోలేకపోయారు. ఆమెపై ట్రోలింగ్ అనే అస్త్రాన్ని వాడి చనిపోయే వరకు వెంటాడారు.ఆన్ లైన్ లో విపరీతమైన పోస్టులు పెడుతుండటంతో చలించి పోయిన ఆమె కన్న బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. వారం క్రితం ఎంతో సంతోషంగా కనిపించిన వారి తల్లి.. ఇప్పుడు చలనం లేకుండా పడి ఉండటం చూసి ఆ పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కడుపులో దాచుకోవాల్సిన తల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలియడంతో ఆ పసి హృదయాల్లో తీరని దుఃఖం నెలకొంది. పట్లేని దుఃఖంతో కన్నతల్లిని కడసారి చూసుకుంటున్న ఆ చిన్నారుల ఫొటో ప్రతి ఒక్కరినీ ఏడిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: