తన పవర్‌ ఏంటో జగన్‌కు రుచిచూపించిన బాబు?

చంద్రబాబు ఒక విషయంలో అయితే తనకు తాను నిరూపించుకున్నారు. ఎలా అంటే కార్యకర్తలకు ధైర్యం నూరిపోయడంలో ఆయన ముందున్నారు. 2019 లో జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇక టీడీపీ పని అయిపోయింది. తిరిగి ఆయన పుంజుకోవడం కష్టమే అనే మాటలు వినిపించాయి. కానీ ఆయన ధైర్యంగా నిలబడి తిరిగి 2024లో ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

గత ఎన్నికలకు భిన్నంగా బీజేపీ, జనసేనతో కలిసి ఈ సారి మరింత శక్తిమంతంగా ఎన్నికలకు వస్తున్నారు. ఈ పరిణామాలను జగన్ ఊహించి ఉండరు.  ఈ ఐదేళ్ల కాలంలో పార్టీ కార్యాలయాలపై దాడులు, అసెంబ్లీలో అవమానాలు, పార్టీ నాయకులపై కేసులు,  ఏకంగా ఎన్టీఆర్ ట్రస్టుపై కూడా దాడలు జరిగాయి.  కానీ చూస్తూ ఉండటం తప్ప చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. చిన్నచితాకా ఆందోళనలు నిర్వహించినా.. అవి ఏమంత ప్రభావం చూపలేకపోయాయి. దీంతో పాటు స్కిల్ డెవలెప్ మెంట్ కుంభకోణం కేసులో ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి జైలు జీవితం అనుభవించారు.

ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు పనై పోయింది. అని వైసీపీ నాయకులు భావించారు. కానీ అదే సమయంలో పవన్ తో పొత్తు ప్రకటించి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. సీఎం పవర్ షేరింగ్, మూడో వంతు సీట్లు వంటి అంశాలు వినిపించినా..  ఎన్నికల చివరి నాటికి చంద్రబాబు డామినేషన్ రాజకీయాలే నడిచాయి. ఇస్తే తీసుకునే స్థాయి కాదు.. తాను ఇంకా ఇచ్చే స్టేజీలోనే ఉన్నారు అని నిరూపించగలిగారు.

బీజేపీ బేరం ఆడారే తప్ప.. వాళ్లు అడిగిన సీట్లు ఇవ్వలేదు. యాభై సీట్లు కావాలని వాళ్లు అడిగితే.. చివరికి 30కి తెగ్గొట్టారు. తద్వారా పొత్తును ఆయన నియంత్రణలో పెట్టుకోగలిగారు. మరోవైపు పొత్తుకు బీజేపీ సానుకూలంగా లేకపోయినా.. తన అనునూయుల ద్వారా పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి దీనిని కుదుర్చుకోగలిగారు. అన్ని వైపులా తనకు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారు.  తాను తిట్టిన వారిని మళ్లీ తిరిగి ఒప్పించాలంటే చాలా సహనం, ఓర్పు కావాలి. చంద్రబాబు దానిని చేసి చూపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: