జగన్ సిద్ధం.. ఒక ట్రెండ్ సెట్‌ చేసిందా?

నేను ట్రెండ్ ఫాలో అవ్వను. సెట్ చేస్తాను. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్  కల్యాణ్ డైలాగ్. నిజ జీవితంలో మాత్రం ఈ డైలాగ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి సెట్ అవుతుంది. ఎందుకంటే జగన్ అనుసరిస్తున్న వ్యూహాలనే 40 ఇయర్స్ ఇండస్ర్టీ చంద్రబాబు ఫాలో అవుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బీసీలకు అధిక సీట్లు కేటాయించి.. అది కూడా తన సొంత వర్గం నేతలను కాదని సీట్లివ్వడం ఎవరూ ఊహించని పరిణామం. దీంతో తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే ఉద్దేశంతో ఈసారి ఏకంగా ఎప్పుడూ ప్రకటించని విధంగా చంద్రబాబు బీసీలపై హామీల వర్షం కురపించారు. మరోవైపు 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుంటే అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన చంద్రబాబు.. 2019లో కేంద్రంపై తిరుగుబాటు చేసి దిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్మ దీక్షలు చేశారు.

కేంద్రంతో  సఖ్యతగా ఉంటేనే నిధులు వస్తాయని జగన్ చెబితే అదే అంశం సాకుగా చూపి ఇప్పుడు బీజేపీ పొత్తులు పెట్టుకున్నారు. పొత్తు వెనుక రాజకీయ ఎజెండా ఉన్నా పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తెరపైకి తెచ్చారు. విజనరీ గా ఎదుటి వారికి అజెండాలు తయారు చేసే ఆయన ఇప్పుడు జగన్ పై ఆధారపడుతున్నారు.  

సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని.. మరో శ్రీలంకగా మారుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కి మించి సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు. ఇలా ప్రతీది జగన్ నే ఫాలో అవుతున్నారు. అలాగే ప్రస్తుతం జగన్ సిద్ధం సభలను నిర్వహిస్తున్నారు. ఇందులో ర్యాంప్ వాక్ లా కొంత దూరం వెళ్లి ప్రజలకు అభివాదం చేస్తూ.. అలానే వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నమూనాలో పశ్చిమ బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జగన్ సభ ల మాదిరిగా ర్యాంప్ వాక్ ఉండేలా సభలను ఏర్పాటు చేయిస్తున్నారు. అంటే జగన్ సిద్ధం సభల ద్వారా కూడా కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: