పొత్తులతో బయటపడ్డ చంద్రబాబు బలహీనత?

రానున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి.  వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఏ పార్టీతో కలుస్తున్నారు.. ఎవరు పొత్తులో ఉన్నారు. ఏ పార్టీ సింగిల్ గా పోటీకి వస్తుంది అనే అంశాలపై చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఇప్పుడే స్పష్టత వచ్చింది. మొన్నటి వరకు టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా ఉండతా అనే అనుమానాలు రేకెత్తాయి. వాటికి పుల్ స్టాప్ పెడుతూ ఎన్డీయే లోకి టీడీపీ చేరింది.

అయితే ఇక ఎన్నికలు సమరం దగ్గరికి వచ్చేసింది. ఈ సమయంలో ఇక విమర్శలు, ఆరోపణలు ఉండవు. నేరుగా ప్రశ్నలే సంధిస్తుంటారు. వీటిపై ఖండన ఎంత ఆలస్యం అయితే ఆయా పార్టీలకు అంత నష్టం జరగుతూ ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు అధికార వైసీపీ అరాచకాలు చేస్తోందని.. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తోందని.. ప్రజలు విసిగిపోయారు అని భావిస్తున్నారు . తద్వారా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశగా ఉన్నారు.

అయితే మొన్నటి అద్ధంకి సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ చంద్రబాబుకి పలు ప్రశ్నలు సంధించారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే.. మీరు గెలుస్తారు అనే నమ్మకం ఉంటే పొత్తుల కోసం దిల్లీలో ఎందుకు పడిగాపులు కాశారని ప్రశ్నించారు.  రాష్ట్రాభివృద్ధి కోసం.. ఏపీకి మంచి చేసేందుకు అన్ని ఇప్పటికే అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు ప్రకటించారు.

జగన్ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలద్దొనే ఉద్దేశంతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.  మరి ఇన్ని అవమానాలు ఎదుర్కొని ఒక్క శాతం ఓటు బ్యాంకు లేని బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సిన బాధ్యత టీడీపీ పై ఉందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా తన పాలన అంతా బాగా లేనప్పుడు ఇంత మంది అవసరం లేదని జగన్ ఈ విధంగా మాట్లాడారు. ఆరుగురు కలిసి తన పై దాడి చేస్తున్నారని విమర్శించారు. మరి దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: