చంద్రబాబును ఇబ్బందిపెడుతున్న జగన్‌ లెక్కలు?

ఏపీ సీఎం జగన్ ఈ సారి కొత్త పంథాని ఎంచుకున్నారు ఎప్పుడూ ప్రత్యర్థులను విమర్శించే ఆయన… ఈ సారి లెక్కలతో సహా ప్రజలకు తాను అందించే సంక్షేమ పథకాలను వివరించారు.  తాము వస్తే ఏం చేస్తామో చెప్పిన జగన్.. తన పథకాలకు అయ్యే ఖర్చు.. టీడీపీ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో వివరించే  ప్రయత్నం చేశారు.

బాపట్ల జిల్లాలోని మేదిరి మట్లలో వైసీపీ నాలుగో సిద్ధం సభను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏదీ చేయలేదని.. ఏనాడు మ్యానిఫెస్టోని అమలు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు సున్నా అని.. దాని పక్కన ఎన్ని పార్టీలు కలిపినా సున్నా విలువ మారదని ఎద్దేవా చేశారు. 2014లో రైతులకు రుణమాఫీ పై తొలి సంతకం, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడం, ఇంటికో ఉద్యోగం.. ఇవ్వలపకోతే. నిరుద్యోగ భృతి కింది రూ.3వేలు ఇలా చెప్పిన ఏ హామీని అమలు చేయలేదని తూర్పారపట్టారు.

2024 ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం కూడా తాము అమలు  చేసిన ఎనిమిది పథకాలను కొనసాగించాల్సి ఉంటుందని వివరించారు. 66లక్షల పెన్షన్లకు రూ.24 వేల కోట్లు, రైతులకు ఉచిత విద్యుత్తు రూ.11 వేల కోట్లు, రాయితీ బియ్యం ఇచ్చేందుకు రూ.4600 కోట్లు, ఆరోగ్య శ్రీ కింద రూ.4400 కోట్లు, విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.5వేల కోట్లు, ఇలా పలు పథకాలకు రూ.52,700 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.

అలాగే చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే  ఏడాదికి రూ.83,317 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. ఏడో హామీకి రూ.87 వేల కోట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడ నుంచి తీసుకు వస్తారో చెప్పడం లేదని విమర్శించారు. తాను ఈ 58 నెలల కాలంలో 138 సార్లు బటన్ నొక్కి రూ.3.78లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి డబ్బు జమ చేశానని వివరించారు. తాను మాట ఇస్తే తగ్గేవాడిని కాదని.. 99 శాతం హామీలు అమలు చేశామని.. అందుకే మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: