ఊహించనన్ని సీట్లు.. అయినా కనిపించని జోష్‌?

1999 నుంచి పలు దఫాలుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి దానిని కొనసాగించింది. 1999, 2004, 2014 సీరిస్ ని కంటిన్యూ చేస్తూ 2024లో మరోసారి జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు టీడీపీ వెళ్లనుంది. ఇప్పటికే పొత్తులపై క్లారిటీ రావడంతో పాటు సీట్ల సర్దుబాటుపై కూడా ఇరుపార్టీల మధ్య ఓ స్పష్ఠత వచ్చింది. ఆ పార్టీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతోంది.

అయితే ఈ పొత్తుల వ్యవహారమై ఏపీ క్యాడర్ లో నైరాశ్యం వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో చేరికలతో ఎన్నికలకు దూసుకుపోతుంటే ఏపీ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పొత్తుల వ్యవహారం దెబ్బతీసింది. చివరకు 14శాతం ఓట్లు సాధించినా.. ఎనిమిది సీట్ల దగ్గరే ఆగిపోయింది. ఈ సారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా లోక్ సభ ఎన్నికలకు ఏ పార్టీతో పొత్తులు లేకుండా సింగిల్ గా ఎన్నికలకు వెళ్తోంది.  ఇది బీజేపీ శ్రేణులకు ధైర్యానిచ్చింది.

ఏపీ పరిస్థితికి వచ్చే సరికి గత ఎన్నికల్లో ఒక శాతం ఓటు బ్యాంకుకు పడిపోయింది. చంద్రబాబు మీద కోపంతో బీజేపీ సానుభూతి పరులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సారి టీడీపీ తో పొత్తు పెట్టుకోకపోతే 175 స్థానాల్లో పోటీ చేద్దామని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. కేంద్రంలో మరోసారి మోదీయే వస్తారని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఈ అనుకూల పవనాలు ఏపీలో బీజేపీ ఎదిగేందుకు దోహదపడతాయని వారంతా భావించారు.

కనీసం పదిశాతం పార్లమెంట్ స్థాయిలో.. ఐదు శాతం అసెంబ్లీ సీట్లలో ఓటు బ్యాంకు సాధించడం ద్వారా తమ ఉనికిని చాటుకొని 2029 ఎన్నికలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భావించారు. కానీ అధిష్ఠానం వారి ఆశలపై నీళ్లు చల్లింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఆపార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు అన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: