చంద్రబాబు.. ఓటర్లను మాయ చేయబోతున్నారా?

చంద్రబాబు వ్యవస్థల్ని నమ్ముకుంటారు. ప్రింట్ మీడియా, ఎలక్ర్టానిక్ మీడియా, సోషల్ మీడియా వంటి వాటిని ఆయన చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు. ఇప్పటికే గత ఐదేళ్ల నుంచి వీరు చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు.  ఇవి టీడీపీకి షాడో లో కంచుకోటలా ఉన్నాయి.  ఇప్పుడు వీరికి బీజేపీ కూడా జత కావడంతో అగ్నికి వాయువు తోడైనట్లు ఇక చంద్రబాబు గెలుపు ఖాయం అనేదానిని ప్రజల్లోకి తీసుకెళ్తారు.

తద్వారా టీడీపీ గెలుస్తుంది అనే దానిని మౌత్ పబ్లిసిటీ చేస్తారు. ఇది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపిందో మనం అందరం గమనించాం. కర్ణాటకలో గెలవగానే.. తెలంగాణలోను కాంగ్ఎస్ గెలవబోతుంది అనే ఒక మౌత్ పబ్లిసిటీని కాంగ్రెస్ తీసుకు రాగలిగింది. మరో వైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అందుకే కవితను అరెస్టు చేయలేదు అనే వాదనను తెరపైకి తీసుకువచ్చి దానిని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

విశేషం ఏంటంటే.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ రెడ్డికి అనుకూలంగా టీడీపీ సోషల్ మీడియా పనిచేసింది. ఇప్పుడు కూడా ఏపీలో టీడీపీ గెలవబోతోంది అనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక విషయాన్ని పదే పదే చెప్పించడం ద్వారా ప్రజలు దానినే నిజం అని నమ్ముతారు. ఇలాంటి తరహా ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలా అంటే గెలిచే పార్టీకే ఓటేయాలని గ్రామీణులు భావిస్తుంటారు.

వీరు పదే పదే ఈ తరహా ప్రచారాన్ని తీసుకెళ్లడం ద్వారా వీరు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇతర వ్యవస్థలు అయిన ఉద్యోగ, పోలీస్ లను చంద్రబాబు తెలివిగా ఉపయోగించుకుంటారు. ఇప్పటి వరకు వీరికి కేంద్రం అండ లేదు. ఇప్పుడు బీజేపీ తోడు కావడంతో అధికారులు తన మాటే వింటారు అని చంద్రబాబు భావిస్తున్నారు.  పోల్ మేనేజ్ మెంట్ లో టీడీపీ అధినేత సిద్ధ హస్తుడు కావడంతో తమ పార్టీ గెలుపు నల్లేరుపై నడకే అని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: