బాబు ఖుషీ.. మోడీ ఖుషీ.. పవన్‌ బలిపశువు?

ఎట్టకేలకు ఎన్డీయే కూటమిలో టీడీపీ చేరింది. పొత్తుల విషయమై సుదీర్ఘంగా కసరత్తులు జరిపిన బీజేపీ అధిష్ఠానం చంద్రబాబు ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ పొత్తు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్, జేపీ నడ్డాలు ప్రకటించారు.

ఈ సమయంలో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు ఎల్లో మీడియా కేటాయించే సీట్లు ఇవేనని ప్రచారం చేస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు వీరే అనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా వాంతా ఏపీ బీజేపీ నేతలు కావడంతో దాదాపు వీరి పేర్లు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.  పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, ఎనిమిది లోక్ సభ సీట్లు కేటాయించారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే జనసేనకు మూడు ఎంపీ సీట్లు ప్రకటించగా ఇందులోనే కోత పెట్టి దీనిని బీజేపీకి కేటాయించేలా చంద్రబాబు వ్యూహం పన్నారని పొలిటకల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. బీజేపీ ఎంపీలుగా పరిపూర్ణానంద, కొత్తపల్లి గీత, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్ , రత్నప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో జనసేనకు 24 అసెంబ్లీ, రెండు ఎంపీ లే కేటాయిస్తారని తెలుస్తోంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందు నుంచి భావించినట్లు 30 లోపు సీట్లకే మిత్రపక్షాలను పరిమితం చేశారు. ఈ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా పది నుంచి తొమ్మిది.. అక్కడి నుంచి ఆరుకి ఒప్పుకుంది. ఎలాగైనా సరే బీజేపీ తాను అనుకున్నది సాధిస్తుంది అని భావించిన పలువురు రాష్ట్ర నేతల ఆశలకు గండిపడినట్లయింది. చంద్రబాబు డైరెక్షన్ లోనే పొత్తులకు అమిత్ షా, నడ్డాలు అంగీకరించినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: