టీడీపీ-బీజేపీ పొత్తు.. ఎల్లో మీడియా ఓవర్‌యాక్షన్‌?

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరుతుందా? ఎన్డీయే వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతుందా?  చంద్రబాబు దిల్లీ వెళ్లారా.. లేక దిల్లీ పెద్దలు వచ్చి చంద్రబాబుని కలిశారా.. రెండు మూడు రోజులుగా ఇదే ఆసక్తికర చర్చ  నడిచింది. ఎట్టకేలకు పొత్తు కుదిరింది. అయితే.. ఈ ప్రహసనంలో  ముఖ్యంగా ఎల్లో మీడియా పొత్తులపై నడుపుతున్న కథనాలు నవ్వు పుట్టిస్తున్నాయి. అంతా బీజేపీ అవసరమే అన్నట్లు.. టీడీపీకి ఏ అవసరం లేనట్లు బీజేపీ పెద్దల  కోరిక మేరకే చంద్రబాబు పొత్తులు అన్నట్లు ఒక  సెక్షన్ ఆఫ్ మీడియా కథనాలు రాస్తుండటం విశేషం.

గత ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. బీజేపీని విభేదించి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే టీడీపీకి ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. బీజేపీకి అంతులేని మెజార్టీ దక్కింది. అప్పటి నుంచి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. చేసిన  తప్పు తెలుసుకొని పార్టీకి చెందిన నలుగురు రాజ్య సభ సభ్యులను బీజేపీకి అప్పగించారు.

అయినా సరే బీజేపీకి టీడీపీపై కోపం తగ్గలేదు. గత నాలుగేళ్లుగా దూరం పెడుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట జాతీయ రాజకీయాల దృష్ట్యా టీడీపీని దగ్గర చేసే ప్రయత్నం చేసింది. అది కూడా చంద్రబాబు ఎన్నో ప్రయత్నాల చేయడంతో కాస్త కనికరించింది. అయితే ఇప్పుడు టీడీపీ ఎన్డీయే లో చేరింది. కేవలం బీజేపీ అవసరాల కోసమే అన్నట్లు ఎల్లో మీడియా అభివర్ణిస్తోంది.

ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఈ విషయంలో  చేస్తున్న ప్రచారం అతి అనిపిస్తోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు అవసరం ఉన్నట్లు…చంద్రబాబు లేనిదే కేంద్రం నడవదు అనే స్థాయిలో ప్రచారానికి ఆజ్యం పోస్తుంది. పొత్తుల విషయంలో లేనిపోని లెక్కలు చూపుతోంది. తొలుత నాలుగు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకున్నట్లు ప్రచారం జరిపింది. పొత్తుల్లో జాప్యానికి ఈ ప్రచారమే కారణం అనే వాదనలు ఉన్నాయి. చంద్రబాబు తలకిందులై బీజేపీని పొత్తుకు ఒప్పిస్తే ఆంధ్ర జ్యోతి మాత్రం అతిగా ప్రవర్తిస్తూ.. లేనిపోని అపోహలకు కారణం అవుతోంది. ఇదే నలుగురిలో నవ్వుల పాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

abn

సంబంధిత వార్తలు: