టీడీపీలో గందరగోళం.. ఎల్లో మీడియా కవరింగ్‌?

ఏ పార్టీలో అయినా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసంతృప్తులు బయట పడటం సహజం. అధికార పార్టీ అయినా.. ప్రతి పక్ష పార్టీ అయినా ఆయా స్థానాల్లో ఆశావహుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఎవరికి అయినా ఎమ్మెల్యే అవ్వాలనే ఆశ తప్పకుండా ఉంటుంది. ఇది సహజం. కానీ తమకు అనుకూలంగా వ్యవహరించే పార్టీలైతే ఒకలా.. ప్రత్యర్థి పార్టులు అయితే మరోలా వార్తలు రాయడం ప్రస్తుతం ఏపీలో కనిపిస్తోంది.

ఏపీలో సీఎం జగన్ భారీ ఎత్తున సోషల్ ఇంజినీరింగ్ కి తెరలేపారు. చాలా చోట్ల సిట్టింగ్ లను మార్చారు. మరికొంత మందికి స్థాన చలనం కల్పించారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో వైసీపీలో అసంతృప్త జ్వాలలు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ఇలా రకరకాల వదంతులను సృష్టించారు.

ఇప్పుడు అదే టీడీపీ సీనియర్ తెలుగు తమ్ముళ్లను పక్కన పెట్టింది. పార్టీని నమ్ముకొని ఆది నుంచి పార్టీ వెన్నంటే ఉన్న సీనియర్ నాయకులకి తొలి జాబితాలో చోటు ఇవ్వలేదు. అసలు సీట్లు ఇస్తుందో లేదో కూడా తెలియడం లేదు. కానీ వీటిని మాత్రం ఎల్లో మీడియా ఏమాత్రం ప్రచురించదు. తాజాగా మైలవరం వసంత కృష్ణకే అని ప్రచురించింది. వాస్తవానికి దేవినేని ఉమ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. సీనియర్ లీడర్. ఈ సారి టికెట్ ఆయనకు కాదని.. వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కి కేటాయించారు.

ఈ వార్తను హైలెట్ చేయకుండా.. దేవినేని ఉమతో అచ్చెన్నాయుడి చర్చలు.. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న మాజీ మంత్రి ఇలా కవర్ చేశారు. దీంతో పాటు పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకున్న మహా సేన రాజేశ్.. సర్వేపల్లిలో సోమిరెడ్డి కి ప్రతికూలత. కళాకు తప్పని వర్గ పోరు. పెద్దకోరుపాడు లో శ్రీధర్ పైనే అంతే. వెంకటగిరి బరిలో కొరువండ్ల కుమార్తె. టీడీపీ కసరత్తులో కీలక పరిణామం. ఇవన్నీ ఏంటివి. టీడీపీ లో గందరగోళాలే. కానీ చంద్రబాబు చక్క బెట్టేస్తున్నారు. అదే వైసీపీలో అయితే తిరుగుబాట్లు. నిరసన గళాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: