కేసీఆర్‌.. చివరకు ఏ పరిస్థితి వచ్చిందయ్యా?

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారాన్నికొనసాగించి.. ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రాభం క్రమంగా మసకబారుతోంది. దేశ రాజకీయాలు చేస్తామని చెప్పి దేశ్ కీ నేత అని పిలిపించుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను చేయలేకపోతున్నారా. ఒకప్పుడు ఏఎస్పీ లేదు.. బీఎస్పీ లేదు అంటూ మాట్లాడిని కేసీఆర్ లోక్ సభ ఎన్నికలకు వచ్చే సరికి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పొత్తు  బీఆర్ఎస్ ప్రతిష్ఠను కిందకి నెట్టిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఏ పార్టీని పట్టించుకున్న పాపాన పోలేదు. తన అవసరం కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో కామ్రేడ్లను ఉపయోగించుకున్న కేసీఆర్ ఆ తర్వాత వారికి కనీసం అపాయిట్ మెంట్ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో బీఎస్పీని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గుర్తించింది కూడా లేదు. ఒకానొక సందర్భంలో బీఎస్పీనా.. ఏ ఎస్పీనా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు ఆయనెలా ఉంటారు అంటూ ఎదురు ప్రశ్నించారు కేసీఆర్.

సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత ఆ పార్టీలో పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ని తిట్టి మూడు నెలలు కూడా గడవక ముందే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. గతంలో ఒక్కో స్థానానికి ముగ్గురికి పైగా పోటీ పడిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆయన పొత్తు కోసం బీఎస్పీతో చేతులు కలపాల్సి వచ్చింది.

కేసీఆర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. చంద్రబాబుకి ఉన్నతం ఓపిక లేదు. ఎన్టీఆర్ కు ఉన్నంత సహనం లేదు. జగన్ కు ఉన్నంత పంతం కూడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని.. అందుకే బీఎస్పీతో కలుస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఒకానొక సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అంటూ కేసీఆర్ మాట్లాడారు. వీటిని అప్పుడే మర్చిపోతే ఎలా సారూ అంటూ కొందరూ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: