జనం చెవుల్లో నారా లోకేశ్ పువ్వులు పెడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో రానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది. ఈ క్రమంలో మార్చి 5న ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను టీడీపీ, జనసేన ప్రకటించాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఇందులో పేర్కొన్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా బీసీలకు వైసీపీ ఏం చేయలేదని విమర్శించాయి.

విభజిత ఏపీలో ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ పాలన కూడా ఐదేళ్లు పూర్తి కావొచ్చింది. ఇప్పుడు బీసీలకు ఎవరు ఏం చేశారు అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే బీసీ డిక్లరేషన్ సభ ఎక్కడ అయితే బాగుంటుంది అని పార్టీ ఆలోచించినప్పుడు నారా లోకేశ్ మంగళగిరి అయితే బాగుంటుంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది అని సలహా ఇచ్చారంట. తద్వారా ఎక్కువ శాతం ఉన్న బీసీలను తన వైపునకు తిప్పుకోవచ్చన్నది ఆయన వ్యూహం.

ఈ సందర్భంగా నారా లోకేశ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు  నాయుడు, పవన్ అన్నకి మాట ఇస్తున్నా.. మంగళగిరి ని గెలిచి మీకు అప్పగిస్తా. బీసీలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిన పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు.

అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవేంటంటే.. బీసీలందరూ పేదరికం నుంచి బయటకు వచ్చేశారా.. అలాంటి సమయంలో కొంతమందికి బ్యాక్ వర్డ్ క్యాస్ట్ అనే ధ్రువీకరణ పత్రం ఎందుకు. వీరు ఆర్థికంగా బాగా లేరు అనే ఉద్దేశంతోనే దీనిని తీసుకువచ్చారు. వీరంతా ధనవంతులు అయితే రిజర్వేషన్లు ఎందుకు.. అసలు టీడీపీ హయాంలో పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు ఏ నివేదిక చెప్పింది. దీంతో పాటు కేవలం బీసీల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రవేశ పెట్టిన పథకాలు ఏంటి. అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: