జగన్‌ మేనిఫెస్టో.. బాబును మించిన వరాలు రెడీ?

గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో నవరత్నాలు కీలక పాత్ర పోషించాయి.  కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల మాదిరిగా అవి కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఓటర్లు వాటికి ఆకర్షితులై వైసీపీ కి పట్టం కట్టారు. అద్భుతంగా పరిపాలించాం అని టీడీపీ ప్రచారం చేసుకున్నా.. ప్రజలు నూతన పథకాల వైపే మొగ్గు చూపారు. అన్న క్యాంటీన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకం పేరిట రూ.10 వేలు ఇవ్వడం, పింఛన్ రూ.2వేలు ఇవ్వడం లాంటివి తనకు మేలు చేస్తాయని చంద్రబాబు భావించారు. కానీ నవరత్నాలను వైఎస్ జగన్ ప్రకటించడంతో ఇవన్నీ పక్కకు వెళ్లిపోయాయి.  

దీంతో గత అనుభవాల పాఠాలతో చంద్రబాబు ఇప్పుడు వైసీపీకి మించి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికే ప్రకటించగా తాజాగా మరో రెండు పథకాలను తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి షాక్ అనే చెప్పవచ్చు.  జగన్ తరహాలో పింఛన్లు పెంచుకుంటూ పోతాం అని కాకుండా ఒకేసారి రూ.4000 వేలు పింఛన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి వైసీపీకి మాస్టర్ స్ర్టోక్ ఇచ్చారు.  అయితే ఇది మిగతా అన్ని వర్గాలకు వర్తింపజేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకుంటే ఆయా వర్గాలపై వివక్ష చూపితే ఓట్లు వేయరు కదా.

ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందో చూడాలి. పింఛన్ నాలుగు వేలను దశల వారీగా అమలు చేస్తామని చెబితే ప్రజలు అంగీకరించరు. టీడీపీకి మించి అంటే రూ.5వేలను ఇస్తారా అనేది చూడాలి. రాష్ట్రం తాజా పరిస్థితి గమనిస్తే.. ప్రస్తుతం ఏపీలో 65లక్షల మందికి పింఛన్ ఇస్తున్నారు. ఇందులో 35లక్షల మందికి కేంద్ర రూ. 1400 చొప్పున ఇస్తుంది. మిగతా వారికి.. మిగిలిన డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దీంతో పాటు 50  ఏళ్లకే వర్తింప జేస్తామని చెప్పడంతో అర్హుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇప్పుడు జగన్ వీటికి దీటుగా సంక్షేమ ప్రకటిస్తారా. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: