బ్రదర్ అనిల్‌కి పోటీకి ఆమెను రంగంలో దింపిన జగన్‌?

ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ సీఎం జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పలు జిల్లాల పర్యటనలు చేస్తున్న ఆయన పలు చర్చిల్లో పాల్గొంటూ.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకంటే మీకే బాగా తెలుసు అని దేవుడు ఉన్నాడని రాష్ట్రంలో జరగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూస్తూ ఊరుకోడు అని అన్నారు.

అయితే ఆయన నేరుగా పార్టీ పేరు చెప్పి విమర్శించడం లేదు. ఎందుకంటే అలా చేస్తే ఆయన్ను పార్టీ మనిషిగా ముద్ర వేస్తారు. అందువల్లే ఆయన వైసీపీపై పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఇటీవల షర్మిళను పోలీసులు అరెస్టు చేసిన ఘటనపై కూడా ఆయన స్పందించారు. తాత్కాలిక ఆనందం కోసం ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదని వ్యాఖ్యానించారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా క్రిష్టియన్ ఓటర్లను కూటగట్టడంలో బ్రదర్ అనీల్ కీలక పాత్ర పోషించారు అని టాక్. ఇప్పుడు సీఎం జగన్ తో విభేదించిన తన భార్యకి మద్దతుగా క్రైస్తవ ఓటర్లను కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేలా చూస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రార్థనల్లో పాల్గొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉండగా గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు కూడా ప్రభావం చూపుతాడని వైసీపీ భావిస్తోంది.

అందుకే నష్టనివారణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా జగన్ మేనత్త విమలమ్మను రంగంలోకి దింపింది. ఈమె పలు చోట్ల సమావేశాలు నిర్వహిస్తోంది. సేవకుల మీటింగ్ పేరుతో పాస్టర్లకు తలా రూ.వెయ్యి, వారికి కావాల్సిన సదుపాయాలతో పాటు భోజనాలు ఏర్పాటు చేస్తూ సమావేశాలు పెడుతోంది. జగన్ ను మరోసారి గెలిపించాలని కోరుతుంది. ఇటీవల నిర్వహించిన సభకు ఓ మూడు వేల మంది వస్తారని రూ.వెయ్యి చొప్పున గిఫ్ట్ ప్యాక్ లు సిద్ధం చేస్తే రెట్టింపు సంఖ్యలో పాస్టర్లు వచ్చారు. వీరికి డబ్బులు ఇవ్వడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మొత్తంగా చూస్తే బ్రదర్ అనీల్ కు పోటీగా జగన్ విమలమ్మను రంగంలోకి దింపారు. చూద్దాం ఇది ఏ మేరకు విజయవంతం అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: