ఆ ఒక్క ప్రశ్న.. జగన్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్ పై టీడీపీ అధినేత మరోసారి విరుచుకుపడ్డారు. బాబాయి హత్య కేసులో సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఈ పాలకులను పరిపాలించే హక్కు లేదని స్వయంగా ఆయన చెల్లెలు సునీత చెప్పారన్నారు. సోదరి పుట్టుకపై కూడా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఏ హత్య కేసు అయినా నాలుగైదు రోజుల్లో తేలుతుందని.. వివేకా హత్యకేసు అయిదేళ్లు అయినా ఇంకా తేలడం లేదని విమర్శించారు. అయితే ఈ విషయమై ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు మాట్లాడతారా అని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వివేకాను ఎవరు చంపారు అంటే  చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ అని జగన్ ఆరోపించారు. తన అనుకూల మీడియాలో నారాసుర రక్తచరిత్ర అని పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకున్నారు.

ఆ తర్వాత జగన్ సీఎం అయి ఐదేళ్లు కావొస్తున్నా.. చంద్రబాబే చంపారని ఆరోపణలు చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఒక హత్య కేసు అది కూడా సొంత బాబాయిని చంపింది ఎవరో తేల్చలేకపోయారని విమర్శిస్తున్నారు. దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో జగన్ చెల్లెలు సునీత కానీ.. షర్మిళ కానీ ఎవరిని ఇందులో నిందితులగా చెబుతున్నారో మన అందరికీ తెలిసిందే. జగన్ చంపారని చెప్పడం లేదు.. కానీ చంపినవారికి జగన్ అండగా నిలబడ్డారు అని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల ముందు చంద్రబాబుపై పుంఖానుపుంకాలుగా ఆరోపణలు చేసిన వైసీపీ ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా వివేకా హత్య కేసు గురించి మాట్లడలేదు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో సీబీఐ విచారణ కావాలన్నారు. ఇప్పుడేమో అవసరం లేదన్నారు. ఏపీలో రెండు కేసులు ఎప్పుడూ తేలవని విశ్లేషకులు అంటున్నారు. అందులో ఒకటి కోడి కత్తి కేసు.. రెండోది వివేకా హత్య కేసు. వీటిని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్ప మరేదీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: