సచివాలయాన్ని తాకట్టు పెట్టిన జగన్‌.. నిజమెంత?

ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం ఏకంగా సచివాలయ భవనాలను తాకట్టు పెట్టిందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. రూ. 400 కోట్ల కోసం ఏపీ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టారని.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ప్రతిపాదనలు పంపారని ఆ పత్రిక రాసిన కథనం సంచలనం సృష్టించింది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని...ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయంనే తాకట్టు పెట్టడం ఏంటని సదరు పత్రిక ప్రశ్నించింది. దీంతో ఈ కథనంపై టీడీపీ నేతలు కూడా బాగానే స్పందించారు.

అప్పుల ఊబిలో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదు.. కానీ ఇది ఒక జగనన్నకు  మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మళ్లీ ఇంకో అవకాశం ఇస్తే శ్రీహరికోట,సాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం, పోలవరం డ్యాంలు కూడా తాకట్టు పెట్టేస్తారేమో అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్ చేశారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి.. చివరికి ఉన్న రాజధానిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

నిన్న విశాఖలో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారని.. మద్యం తాకట్టుపెట్టి రూ.48 వేల కోట్లు అప్పు తెచ్చారని.. R&B ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్లు అప్పు చేశారు కానీ రోడ్లు వేయలేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. టిడ్కో ఇళ్లు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని... ఆ టిడ్కో ఇళ్లు కూడా పూర్తి చేయలేదని.. చెత్త పన్నుతో సహా రకరకాల పన్నులతో రూ.లక్షల కోట్లు బాదారని.. ఇలా ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఇప్పటికే ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.

ఇప్పుడు మరో రూ.370 కోట్ల అప్పు కోసం రాష్ట్ర సచివాలయ సముదాయాన్ని hdfc బ్యాంకుకు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రతిష్ట మంటకలిపారన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈ 58 నెలల కాలంలో రూ.12 లక్షల కోట్లు అప్పు తెచ్చారని... సంక్షేమ పథకాలకు రూ.2 లక్షల కోట్లు పోగా మిగిలిన లక్షల కోట్లు ఏమయ్యాయి జగన్మోహన్ రెడ్డి అని గంటా ప్రశ్నించారు. అయితే ఈ కథనం పూర్తిగా అసత్యమని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ పత్రికపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: