రాహుల్ గాంధీ ప్లాన్‌.. ఆ రహస్యం ఏంటో?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత న్యాయ యాత్ర చేపడుతున్నారు. తాజాగా ఆయన యాత్రకు విరామం ప్రకటించారు. ఎందుకుంటే కేంబ్రిడ్జి యూనివర్శిటీ వాళ్లు ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రాహుల్ గాంధీని తమ యూనివర్శిటీలో ఉపన్యాసాలు ఇవ్వడానికి పిలిచారు అని అందుకే న్యాయ యాత్రకు విరామం ప్రకటించారు అని ఆ పార్టీ సినియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు.

దీనిపై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. గతంలో కూడా ఇలాగే 2022లో 2023లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ కి వెళ్లినప్పుడు ఆ యూనివర్శిటీ వాళ్లు తమ అధికారిక సోషల్ మీడియా  ఖాతాలో ఆ విషయాన్ని పోస్టు చేశారు. అయితే ఈ సారి ఆ యూనివర్శిటీ నుంచి ఏ విధమైన పోస్టు రాలేదు. దీంతో ఒ సంస్థ దీనిపై విచారణ చేస్తే అసలు కేంబ్రిడ్జి యూనివర్శిటీ వాళ్లు ఉపాన్యాసాలు ఇవ్వడానికి రాహుల్ గాంధీకి ఎలాంటి ఆహ్వానాలు పంపలేదని తేలింది.

కానీ అదే యూనివర్శిటీ క్యాంపస్ లో గల జీసస్ కాలేజీ కాన్ఫరెన్స్ రూమ్ అయిన ఎల్లెన్ హాల్ లో రాహుల్ మాట్లాడినట్టు జీసస్ కాలేజీ ప్రతినిధి ఓ సంస్థకు మెయిల్ ద్వారా తెలియజేశారు. ఇంకా విశేషం ఏంటంటే.. ఆ వేలెన్ హాట్ మీటింగ్ లు, పార్టీలు పెట్టుకోవడానికి అద్దెకు ఇస్తుంటారు. ఆ విషయాన్ని కాలేజీ ధ్రువ పరుస్తూ రాహుల్ గాంధీ ఆ అద్దె డబ్బులను పెట్టుకున్నారు.

కానీ ఇక్కడ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే.. ఒకవైపు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జోడోయాత్రలు, కాంగ్రెస్ నేతల రాజీనామాలు, రాజ్య సభ ఎన్నికల హడావుడి ఇంత బీజీ సమయంలో కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఉపన్యాసాలు ఇచ్చేందుకు అని అబద్ధాలు చెప్పి మరీ లండన్ ఎందుకు వెళ్లవల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో బోర్డర్ లో ధర్నా చేస్తున్న రైతులు 29వరకు తమ దిల్లీ చలో యాత్రకు ఎందుకు విరామం ప్రకటించారు. అంతా మిస్టరీగానే కనిపిస్తోంది. అది ఏంటి అనేది మరో రెండు, మూడు వారాల్లో బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: