పవన్‌కు చంద్రబాబు బిగ్‌షాక్‌ ఇవ్వబోతున్నారా?

టీడీపీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలపై గట్టి కసరత్తే నడుస్తోంది. ఇప్పటికే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. తాము పోటు చేసే స్థానాల్లో 99మంది అభ్యర్థులని ప్రకటించారు. తామేం సీట్లు ఇచ్చామో పవన్ కల్యాణ్ కు తెలుసని.. ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు జనసేనాని ప్రకటిస్తారని టీడీపీ అధినేత సెలవిచ్చారు.  ఇప్పుడేమో పోటీ చేసే విషయమై గట్టి కసరత్తే అని ఎల్లో మీడియా లో కథనం ప్రచురితమైంది.

అంటే జనసేన పోటీ చేసే స్థానాలపై చంద్రబాబు ఇంకా స్పష్టత ఇచ్చినట్లు లేదు. అందుకే పవన్ కూడా పేర్లు ప్రకటించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో దాదాపు 15 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తొమ్మిది స్థానాల్లో బరిలోకి దిగనుందని తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొత్తులో భాగంగా రెండు స్థానాలు జనసేనకు దక్కే అవకాశం ఉంది.

అందులో ముఖ్యంగా విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ కావాలని ఆ పార్టీ కోరుతోంది. విజయవాడ పశ్చిమ గతంలో ప్రజారాజ్యం గెలిచిన విషయాన్ని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ వర్గానికి చెందిన వ్యక్తిని పోటీ నుంచి దింపితే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.

గుంటూరు జిల్లా విషయానికొస్తే తెనాలి నుంచి సీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతున్నారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ లో ఒకటి కావాలని జనసేన కోరుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు, రాయలసీమలో ఆరు స్థానాలు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. దీని బట్టి చంద్రబాబు సీట్ల విషయం ఇంకా తేల్చలేదు.  కానీ కొంతమంది జనసేన కు సీట్లు ఇచ్చారని కథనాలు రాస్తున్నారు. 24 సీట్లు ఇస్తారా.. ఇంకా తగ్గిస్తారా అనేది త్వరలో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: