పవన్‌ను చిరాకు పెడుతున్న కాపు నేతలు?

టీడీపీ, జనసేన తొలి జాబితాపై ఇరు పార్టీల నేతలు అసంతృప్తిగానే ఉన్నారు. టీడీపీ సంగతి పక్కన పెడితే.. జనసేన పార్టీకి 24 సీట్లు కేటాయించడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని పవన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేనాని తీరుపై కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఇటీవల అసహనం వ్యక్తం చేశారు.

సీట్ల పంపకం విషయమై ఆయన్ను ఉద్దేశిస్తూ ఓ బహిరంగా లేఖ రాశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం ఏంటి? ఆ పార్టీ పరిస్థితి అంత హీనంగా ఉందా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ తన శక్తిని తాను చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారని, 24 సీట్ల నిర్ణయం జనసైనికులను సంతృప్తి పరచలేదంటూ, రాజ్యాధికారంలో వాళ్లు జనసేన వాటా కావాలని కోరుకుంటున్నారని లేఖలో తెలిపారు.

దీనిపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ హరిరామ జోగయ్యను లేఖలు రాయడం వల్ల ఉపయోగం లేదని… వాటిని మానేస్తేనే గౌరవ ప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు. మీరు ఎన్ని లేఖలు రాసినా అక్కడ ప్రయోజనం ఉండదని వివరిస్తున్నారు. పవన్ కు తన సత్తా ఆయనకు తెలుసని అందుకే 24 సీట్లకు పరిమితం అయ్యారని వివరిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలో బలమైన అభ్యర్థులు లేరు అనే మాట వాస్తవం.

జీరో పాలిటిక్స్ అనే అంశంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఎలా అలే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుత రాజకీయాలకు డబ్బులు కావాలని ఆయనే బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేనలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు లేరు. దీంతో ఈ సారి ఎలాగైనా టీడీపీ పొత్తుతో అయినా అసెంబ్లీలో తన పార్టీ ప్రాతినిథ్యాన్ని పెంచుకోవాలని పవన్ భావిస్తున్నారు. తన వెంట సీఎం సీఎం అని తిరిగే వాళ్లు ఓటేయరని పవన్ కు అర్థమైంది. అందుకే ఈ సారి అయినా టీడీపీ మద్దతుతో అయినా అసెంబ్లీలో అడుగు పెట్టాలని జనసేనాని భావిస్తున్నారు. చూద్దాం చివరకు ఏం అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: