ఆ రహస్యం బయటపెట్టి పరువు తీసుకున్న పవన్‌?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సినిమా పరంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కానీ రాజకీయాలకు వచ్చే సరికి వీరంతా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. జనసేన ప్రారంభంలో పార్టీ కోసం స్వచ్ఛందంగా కొంత మంది వాలంటీర్లు పనిచేసేవారు. క్రమేణా వీరి సంఖ్య తగ్గుతూ వస్తోంది. టీడీపీ విషయానికొస్తే 70శాతం మంది స్వచ్ఛందంగా పనిచేస్తుంటారు. తమ పార్టీ జోలికి వస్తే ఎవర్ని అయినా సరే విమర్శిస్తుంటారు.

ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు కోసం బీజేపీ అగ్రనేతలను ఒప్పించడానికి తాను చెమటోడ్చాల్సి వచ్చిందని, కాషాయ నేతలను దండం పెట్టి మరీ వేడుకున్నానని వారితో చివాట్లు తిన్నాననిఅన్నారు. దీంతో పాటు ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పొత్తు ప్రకటించి ఆ పార్టీకి మేలు చేశానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. తామేదో బీజేపీ తో పొత్తు కోసం తహతహ లాడుతున్నట్లు పవన్ మాట్లాడారని అంటున్నారు.

ఈ మేరకు తమ సోషల్ మీడియా ద్వారా పవన్ వై విమర్శలు గుప్పిస్తున్నారు. మరీ ఈ దండాలే పెట్టి పదేళ్లుగా బయట ఉన్న ముద్దాయని జైలులో పెట్టించ లేకపోయావా.. ఇదే దండాలు పెట్టి అమరావతే ఏపీ రాజధాని అని చెప్పించలేకపోయావా.. వేలాది మంది రైతుల గోస ఒక్క దండంతో తీరేది కదా.  అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఒక్కదండంతో ఆపి ఉండాల్సింది. పనికిమాలిన పొత్తుల కోసం నీ ఆత్మగౌరవాన్ని ఎందుకు దిగజార్చుకున్నావ్ అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.

పట్టుమని ఒక్క ఎమ్మెల్యే లేని పవన్ కల్యాణ్ తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని వాపోతున్నారు. తమతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ గెలుస్తుందని ఆయన అనడం టీడీపీ నేతల ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇప్పటికే జగన్ అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతుంటే.. తాజాగా చాలా ఆలస్యంగా తొలిజాబితా విడుదల చేయడానికి పవన్ కల్యాణే కారణం అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: